Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ను బాలీవుడ్ కు పరిచయం చేసేది ఈ నిర్మాతే.. కరణ్ కాదు

  • బాహుబలి సక్సెస్  తో బాలీవుడ్ లో యమా క్రేజ్ సంపాదించిన ప్రభాస్
  • ప్రభాస్ ను బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న నిర్మాతలు
  • తాజాగా దర్శకనిర్మాత సాజిద్ నదియద్ వాలాతో హీరో ప్రభాస్ భేటీ
bollywood producer sajid nadiadwala to introduce bahubali prabhas to bollywood

బాహుబలి చిత్రం రిలీజ్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో తెలిసిందే. తెలుగు హీరోగా మాత్రమే ఉన్న ప్రభాస్ ను బాహుబలి టుసాడ్స్ వరకు తీసుకెళ్లి వాల్డ్ హీరోస్ లో ఒకనిలా మారేలా చేసింది. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. ఈ క్రేజ్ తోనే ప్రభాస్ ను ఎలాగైనా బాలీవుడ్ సినిమాలో హీరోగా నటింపజేయాలని, తద్వారా క్యాష్ చేసుకోవచ్చని చాలా మంది బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు. ఆ కోవలోనే బాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా కొనసాగుతూ.. తన పేరునే బ్రాండ్ గా మలిచిన నిర్మాత సాజిద్ నడియడ్ వాలా కూడా ప్రభాస్ ను బాలీవుడ్ కి పరిచయం చేయాలనుకుంటున్నారట.

 

భారీ బడ్జెట్ చిత్రాలు తీయడంతో పాటు కొత్తవారిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడంలో కూడా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. టైగర్ ష్రాఫ్.. కృతి సనన్ లతో చేసిన హీరోపంటి లాంటి చిత్రం నిర్మించిన సాజిద్... ఇప్పుడు మన బాహుబలితో సీక్రెట్ గా సిట్టింగ్ వేశాడనే ప్రచారం సాగుతోంది. బాహుబలి2 సాధించిన ఘన విజయం తర్వాత.. ప్రభాస్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ కూడా బాలీవుడ్ ఎంట్రీపై ఉత్సాహంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో సాజిద్- ప్రభాస్ ల మీటింగ్ పై బాలీవుడ్ ప్రత్యేకంగా చర్చించుకుంటోంది.



ప్రభాస్ లాంటి హీరోను ఎలాగైనా బాలీవుడ్ కి పరిచయం చేయాలని భావిస్తున్నాడట ఈ నిర్మాత. ప్రొడ్యూసర్ మాత్రమే అయినా.. ఈయన డైరెక్షన్ వహించిన ఒకే ఒక చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన కిక్. టాలీవుడ్ కిక్ కి రీమేక్ గా రూపొంది సక్సెస్ సాధించగా.. ఇప్పుడు ప్రభాస్ హీరోగా మళ్లీ తన దగ్గరగా సిద్ధంగా ఉన్న స్క్రిప్ట్ తో స్వీయ దర్శకత్వంలో నిర్మించాలని చూస్తున్నాడట  సాజిద్ నడియడ్వాలా. ప్రభాస్ సై అనాలే కానీ.. ఏ క్షణమైనా అనౌన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios