సైఫ్, షాహిద్, కంగనాల తారాగణంలో రంగూన్ రంగూన్ సినిమాలో సీన్స్ కి కట్ చెప్పిన సెన్సార్ బోర్డ్ కంగనా నగ్నంగా నటించిన సీన్స్ కు కోత పెట్టిన బోర్డ్ సినిమా నిడివి 2గం.5 నికు తగ్గించిన యూనిట్
కంగనా రనౌత్ ,సైఫ్ అలీఖాన్ , షాహిద్ కపూర్ లు నటించిన రంగూన్ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే సినిమా నిడివి ఎక్కువ ఉండటంతో ఏకంగా 40 నిమిషాల నిడివి గల సన్నివేశాలను కట్ చేశారట. ఇప్పటికే ప్రమోషన్ ట్రైలర్స్ క్రియేట్ చేసిన హైప్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కంగనా రనౌత్ కూడా నగ్నంగా నటించిన ఈ మూవీలో ఎలాంటి వినోదం లభిస్తుందోనని అంతా ఎదురుచూస్తుంటే.. నిడివి తగ్గించాలనే టీమ్ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.
విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగూన్ చిత్రం రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది. యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా అయినప్పటికీ శృంగార సన్నివేశాలు కూడా భీభత్సంగా ఉన్నాయి. ఇప్పటికే కంగనా, షాహిద్, సైఫ్ ల రొమాన్స్ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా నిడివి 2గంటల 45 నిమిషాలు ఉండటంతో ఏకంగా 40 నిమిషాల సన్నివేశాలను తొలగించారట. దాంతో ఇప్పుడు సినిమమా 2గంటల 5 నిముషాల నిడివితో మాత్రమే ఉంది. ఇక ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు... బోల్డ్ సన్నివేశాలు చూసి షాక్ అయ్యిందట. అయితే కొన్ని సన్నివేశాలను తొలగించమని సూచించి యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్.
