హీరోయిన్ మిస్తీ ముఖర్జీ అకాల మరణం పొందారు. ఆమె కిడ్నీలు విఫలం కావడంతో మరణించినట్లు తెలుస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొంత కాలంగా మిస్తీ ముఖర్జీ బాధపడుతున్నట్లు సమాచారం. అలాగే ఆమె కిటో డైట్ ఫాలో అవుతున్నారట. రెండు కిడ్నీలు విఫలం కావడంతో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మిస్తీ ముఖర్జీ వయసు కేవలం 27ఏళ్ళు కాగా నిన్న బెంగుళూరులో ఆమె అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. 

మిస్తీ అమ్మానాన్నలతో బెంగుళూరులో ఉంటున్నారు. 2014లో విడుదలైన కాంచి చిత్రంలో హీరోయిన్ గా నటించారు మిస్తీ ముఖర్జీ. ఆ మూవీ కోసం టైటిల్ రోల్ చేయడం మిస్తీ టైటిల్ రోల్ చేయడం జరిగింది. ఇక అంతకు ముందే ఓ ఐటమ్ సాంగ్ తో మిస్తీ వెండితెరకు పరిచయం అయ్యారు. 2013లో విడుదలైన మే కృష్ణ హు చిత్రంలో మిస్తీ ఓ ఐటెం సాంగ్ లో కనిపించడం జరిగింది. 

లైఫ్ కి తో లగ్ గయి, గ్రేట్ గ్రాండ్ మస్తీ, బేగం జాన్ మరియు కంగనా నటించిన మణికర్ణిక చిత్రాలలో మిస్తీ నటించడం జరిగింది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు మరణించగా ఆ లిస్ట్ లో మిస్తీ కూడా చేరారు. పదుల సంఖ్యలో అన్ని పరిశ్రమలకు చెందిన నటులు మరణించారు.  బాలీవుడ్ లో సుశాంత్ సింగ్, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ వంటి ప్రముఖ నటులు మరణించారు. సింగర్ బాలుతో పాటు జయప్రకాశ్ రెడ్డి వంటి నటులు మరణించిన సంగతి తెలిసిందే.