బాలీవుడ్ ఆడియన్స్ కు షాకింగ్ న్యూస్. ఎవరూ ఊహించని విధంగా తనకు వింత వ్యాధి సోకినట్టు ప్రకటించాడు యంగ్ హీరో వరుణ్ ధావన్. తన అభిమానులకు గుండెలు బరువెక్కే వార్త చెప్పాడు. ఆందోళన చెందవద్దంటూ ఆ వ్యాధిపై వివరణ కూడా ఇచ్చాడు స్టార్ హీరో.
ఈ మధ్య ఫిల్మ్ స్టార్ సెలబ్రిటీలు వింత వ్యాధుల బారిన ఎక్కువగా పడుతున్నారు. అంతే కాదు వాటిని దాచిపెట్టడానికి మాత్రం ప్రయత్నించడంలేదు. ఏమాత్రం ఇబ్బంది పడకుండా.. తమ అభిమానులకు ఆ విషయాన్ని చెప్పేస్తున్నారు. సోసల్ మీడియా వేధికగా తమ వ్యాధుల గురించి అనౌన్స్ చేస్తున్నారు. ఇలా చాలా మంది చేశారు. రీసెంట్ గా సమంత తనకు వచ్చిన వింత వ్యాధి గురించి వివరించగా.. తాజాగా బాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్ కూడా తనకు అరుదైన వ్యాధి వచ్చినట్టు ప్రకటించాడు.
తను వెస్టిబులర్ హైపోఫంక్షన్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రకటించారు. ఈ వ్యాధి ఉన్నట్లు ఆ మధ్య చేసిన వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ వెల్లడించారు. చెవిలోపలి భాగాల్లో సమస్య ఏర్పడటం వల్ల ఈ వ్యాధి వస్తుందని తెలుస్తోంది. అయితే దీని వల్ల చాలా రకాల ఇబ్బందులు కూడా వస్తాయని ఆయన చెప్పారు.
తన కొత్త సినిమా భేడియా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్ తాను పూర్తి ఆరోగ్యంగా లేనని, వెస్టిబులర్ హైపోఫంక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు.ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు మగతగా ఉంటడం, శరీరం బరువు కోల్పోవడం లాంటివి ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు. వీటితో పాటుగా చూపు మందగించడం, వినికిడి లోపం కూడా ఏర్పడుతుంటుందట. ఇక ఈ వ్యాధి గురించి తెలియడంతో వరుణ్ ఫ్యాన్స్ కలవరానికి గురయ్యారు. తమ అభిమాన నటుడి పరిస్థితి ఏంటో తెలియక కంగారుపడ్డారు. అయితే ఈ విషయంలో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందడంతో తాజాగా వివరణ ఇచ్చారు వరుణ్.
వరుణ్ ధావన్ స్పందిస్తూ…నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. పూర్తిగా కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నాను. అలవాట్లను మార్చుకుంటున్నా, యోగా చేయడంతో పాటు చికిత్స తీసుకుంటున్నా అని అన్నారు. తన కోసం ఎవరూ బాధపడవద్దని.. తనను ప్రేమిస్తున్న అభిమానులకు ఆయన తెలిపారు. నేను ధైర్యంగా ఉన్నారు. ఈ వ్యాధితో పోరాడుతాను..మీరు ధైర్యంగా ఉండండి.. అంటూ తనపై ప్రేమ చూపిస్తున్నవారికి ధన్యవాదాలు తెలిపారు వరుణ్.
ఇక స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ ధావణ్. వరుస సినిమాలతో.. వరుస విజయాలతో బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సాధించాడు వరుణ్. ఇక రీసెంట్ గా భేడియా మూవీతో తన అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
