తన భార్య కియారా అద్వాని కోసం వంటవాడిగామారిపోయాడు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రా. తన కోసం స్పెషల్ డిష్ కూడా తయారు చేశాడట. మరి ఇంతకీ సిద్దార్ద్ చేసిన ఆ వంటకం ఏంటంటే..? 

బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో కియారా అద్వాని, సిద్దార్ధ్ మల్హోత్ర కూడా ఒకరు. ఈజంట కూడా కామ్ గా ప్రేమించుకుని సడెన్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు. కాని ఒకరి కోసం మరొకరు టైమ్ కేటాయిస్తు.. రొమాంటిక్ టూర్లు వేస్తూ..సరదాగా గడిపేస్తున్నారు. 

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తమ ప్రేమ బంధాన్ని మాత్రం మిస్ అవ్వడం లేదు ఈ జంట. అప్పుడప్పుడు వీరు పెట్టే పోస్ట్ ల ద్వారా తమ మధ్య ప్రేమనువెల్లడిస్తున్నారు. ఈమధ్య చాలా మంది స్టార్ జంటల మధ్య విడాకులన్యూస్ లు వైరల్ అవుతుంటే.. వారికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా..తాము కలిసే ఉన్నామని చెప్పకనేచెప్పుకుంటున్నారు కియారా అద్వాని - సిద్దార్ధ్ మల్హోత్ర. 

ఇక తాజాగా ఈ క్రేజీ క‌పుల్ సిద్ధార్ధ్ మ‌ల్హోత్ర‌ , కియారా అద్వానీ వంటింట చేసిన సంద‌డి నెట్టింట‌కు పాకింది. కియారా అద్వానీ కోసం సిద్ధార్ధ్ వంటవాడి అవతారం ఎత్తాడు. తన భార్యకు ఇఫ్టమైనవి వండిపెట్టడానికి రెడీ అయ్యాడు. త‌న పాక‌శాస్త్ర ప్రావీణ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. కియారా కోసం నోరూరించే పిజాను త‌యారుచేశాడు. దాంతో మురిసిపోయింది కియారా.. వెంటనే ఆ పిజా ఫొటోను కియారా త‌న ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.

టెంప్టింగ్ పిజా తులిసి ఆకులు, బ్ర‌కోలి, టొమాటోలు, క్యాప్సికంతో నోరూరించేలా ఉంది. కియారా ఈ పోస్ట్‌ను సిద్ధార్ధ్‌కు ట్యాగ్ చేస్తూ ఆదివారం బెస్ట్ చెఫ్‌తో..హెల్దీ పిజా ఎన్న‌డూ రుచిగా ఉండ‌దంటూ చెఫ్ ఎమోజీతో ముగించారు. ఇక టేస్టీ, హెల్ధీ పిజా కోసం మీరు ప్ర‌య‌త్నిస్తే వెజ్జీ ఫియ‌స్టా పిజా, దేశీ త‌డ్కా చికెన్ పిజా, మెడిటేరియ‌నియ‌న్ మేజిక్ పిజా, హోల్ గ్రైన్ డిలైట్ వంటి పిజాల‌ను ట్రై చేయ‌వ‌చ్చు.