మహేష్ బాబుతో కలిసి సినిమా చూస్తానన్న షారుఖ్ ఖాన్.. సూపర్ స్టార్ కు థ్యాంక్స్ చెప్పిన బాద్ షా
బాలీవుడ్ బాద్ షా.. కింగ్ షారుఖ్ ఖాన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు. జవాన్ సినిమా గురించి ఆయన చేసిన ట్వీట్ కు షారుఖ్ ఖాన్ కూడా అదే అభిమానంతో అదిరిపోయే రీ ట్వీట్ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురు చూస్తోన్న జవాన్ సినిమా రిలీజ్కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. రేపు (సెప్టెంబర్ 7) భారీ స్థాయిలో ఈసినిమా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ లో టికెట్లు అయిపోగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒక్క బుక్ మై షో ఆప్‌లోనే కోటికి పైగా టిక్కెట్‌లు అమ్ముడయ్యాయి.. కొన్ని చోట్ల.. వేలకు వేలు పెట్టి జవాన్ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు ఆడియన్స్. ఈసారి షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ను మాత్రమే కాకుండా.. సౌత్ ను కూడా టార్గెట్ చేశాడు. అందుకే సౌత్ డైరెక్టర్ అట్లీ... సౌత్ హీరోయిన్ నయనతార, సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ధ్ ఇలా ప్లాన్ చేసి.. సౌత్ మార్కేట్ కు గట్టిగానే వల వేశాడు.
నార్త్‌లోనే అనుకుంటే సౌత్‌లోనూ ఈ సినిమా క్రేజ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అన్నట్టుగా ఉంది. హైదరాబాద్ సహా పలు సిటీలలో బుకింగ్స్ వీర లెవల్లో ఉన్నాయి. ఈ సారి తెలుగు రాష్ట్రాల్లోనూ షారుఖ్ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు చేసేలా కనిపిస్తున్నాడు. అప్పుడే షారుఖ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇన్‌సైడ్ రిపోర్స్ట్ కూడా పాజిటీవ్‌గానే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం కేవలం సినీ ప్రియులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రెటీలు సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఇక షారుక్ ఖాన్ కు దేశ వ్యాప్తంగా సెలబ్రిటీల నుంచి ఆల్ ది బెస్ట్ చెపుతున్నారు తారలు. వారి వారి సోషల్ మీడియా ఖాతాల్లో షారుఖ్ జవాన్ కు సబంధించిన పోస్ట్ లు కనిపనిస్తున్నాయి. ఇక టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. జవాన్ టైమ్ వచ్చేసింది. షారుక్ ఖాన్ పవర్ మొత్తం వెండితెరపై కనబడబోతుంది. ఈ సినిమా అన్ని మార్కెట్లలోనూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ మహేష్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ ను సూపర్ స్టార్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
ఇక ఈ ట్వీట్‌పై జవాన్ స్టార్ షారుఖ్ ఖాన్ తాజాగా స్పందించాడు. మహేష్ బాబుకు థ్యాంక్యూ చెబుతూ.. మీరు సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడు సినిమాకు వెళ్తారో చెప్పండి మీతో పాటు కలిసి సినిమా చూస్తానంటూ... షారుఖ్ రిప్లే ఇచ్చాడు. అయితే ఎప్పటి నుంచో వీరి మధ్య మంచి సబంధాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కూడా. షారుఖ్ ఖాన్ జవాన్ షూటింగ్ సమంయంలో మహేష్. ఆ సెట్స్ కు కూడా వెళ్ళారు కూడా. అంతే కాదు ఇలా ఇద్దరూ హీరోలు ట్వీట్లు చేసుకోవడంతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అంతే కాదు చాలా మంది నెటిజన్లు.. మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ఉంది అంటూ కమెంట్లు చేస్తున్నారు.
అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో నయనతార హీరోయిన్ గా నటించింది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన జవాన్ లో మకల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.