బాలీవుడ్‌లో ఇప్పటికీ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున సల్మాన్ ఖాన్ పేరు చెబుతారు. ఇప్పటికీ ఆయన పెళ్లి గురించి ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే, సల్మాన్ ఖాన్ ఒక బాలీవుడ్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె తండ్రిని కూడా పెళ్లి కోసం అడిగాడు. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ముంబయి: బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో సల్మాన్ ఖాన్ తప్పక ఉంటారు. ఇప్పటికీ ఆయన పెళ్లి పై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏళ్ల తరబడి ఆయనను పెళ్లి గురించి అనేకులు ప్రశ్నలు వేశారు. మీడియా వేసిన ప్రశ్నలకు ఆయన నవ్వి ఊరుకునేవారు. జోక్ చేసి తప్పించుకునేవారు. కొన్ని సంవత్సరాలు ఆయన పెళ్లి టాపిక్ పై సీరియస్ చర్చ జరిగింది. అయితే, సల్మాన్ ఖాన్ స్వయంగా ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని మీకు తెలుసా? అనుకోవడమే కాదు.. ఆ హీరోయిన్ తండ్రి ముందూ ప్రతిపాదన పెట్టాడని స్వయంగా సల్మాన్ ఖాన్ వెల్లడిస్తున్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
1990ల్లో నాటి ఓ పాత ఇంటర్వ్యూ క్లిప్ ఓ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సెకన్ల నిడివితో ఉన్న ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను యాక్టర్ జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు తెలిపారు. అంతేకాదు, ఆమె తండ్రిని కూడా అడిగారని వివరించారు. జూహీ చావ్లాను తనకు ఇచ్చి పెళ్లి చేస్తారా? అని ఏకంగా ఆమె తండ్రిని అడిగారని వెల్లడించారు. కానీ, జూహీ చావ్లా తండ్రి అందుకు నిరాకరించాడని సల్మాన్ ఖాన్ తెలిపారు. 1995లో జూహీ చావ్లా బిజినెస్ మ్యాన్ జే మెహతాను పెళ్లి చేసుకుంది.
Also Read: విడాకుల కోసం మరోసారి కోర్టుకెక్కిన ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్..?
ఓ ట్విట్టర్ యూజర్ ఈ క్లిప్‌ను షేర్ చేశారు. అందులో సల్మాన్ ఖాన్ ఇలా మాట్లాడారు. ‘జూహీ స్వీట్ గర్ల్. అందమైన అమ్మాయి. ఆమెను నాకిచ్చి పెళ్లి చేస్తారా అని జూహీ తండ్రిని అడిగాను. ’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. ఇంటర్వ్యూయర్ వెంటనే ‘మీరు అడిగారా? అతను ఏమన్నాడు?’ అని అడిగింది. అతను నో అన్నాడని సల్మాన్ ఖాన్ చెప్పారు. ఎందుకు నో చెప్పాడని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. తనకు నాకు సరిపోదని అనుకుని ఉంటాడేమో అని సల్మాన్ ఖాన్ వివరించారు.
జూహీ చావ్లా, సల్మాన్ ఖాన్ కలిసి సినిమాలో నటించారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్ బాస్‌లోనూ ఆమె గెస్టుగా వచ్చారు.
