Asianet News TeluguAsianet News Telugu

విక్కీ కౌశల్ కు సల్మాన్ ఖాన్ టైట్ హగ్.. వివాదానికి తెరదింపిన బాలీవుడ్ హీరో.. వైరల్ అవుతున్న వీడియో.

ఈ మధ్య బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ వివాదం. ఆ వివాదానికి తాజాగా పుల్ స్టాప్ పెట్టాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..? 

Bollywood  Hero salman khan shares warm hug with vicky kaushal at iifa 2023 JMS
Author
First Published May 27, 2023, 5:03 PM IST

బాలీవుడ్ లో  వివాదం అంటే గుర్తుకువచ్చే హీరోలలో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. తాజాగా ఉగ్రవాదుల లిస్ట్ లో కూడా చేరిపోయారు సల్మాన్. వివాదానికి కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు సల్మాన్. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆయనపై వివాదాలెన్నో.. తాజాగా కొన్ని రోజులు క్రితం నుంచి సల్మాన్ విషయంలో ఓ కాంట్రవర్సీ నడుస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్. ఎదురుగా వచ్చినా సల్మాన్ ఖాన్ పట్టించుకోలేదు. దాంతో అసలు వివాదం రాజుకుంది. 

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు (ఐఫా) - 2023 మీడియా సమావేశం సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్స్ కాస్త అతి చేశారు. స్టార్ హీరో  విక్కీ కౌశల్ సల్మాన్ ను కలవడానికి వస్తుండగా.. అతన్ని.. పక్కకు నెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. సల్మాన్ తో మాట్లాడేందుకు విక్కీ ప్రయత్నించడం, వ్యక్తిగత సిబ్బంది పక్కకు తోయడం, విక్కీ మాట్లాడుతున్నా బదులివ్వకుండా సల్మాన్ వెళ్లిపోవడంతో దుమారం రేగింది.

 

ఇక దాంతో సల్మాన్ వ్యావహారంపై.. ఆయన బాడీ గార్డుల తీరుపై భారీగా  విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఈ విషయం సోసల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ కూడా హర్ట్ అయినట్టు ఉన్నారు. ట్రోలర్స్ కు సమాధానంగా మరో వీడియో బయటకు వచ్చేలా చేశాడు కండల వీరుడు. ఈ వీడియో రిరలీజ్ అయ్యి 24 గంటలు గడవకముందే మరో వీడియో బయటికి వచ్చింది. 

ఈ వీడియోలో ఓ కార్యక్రమంలో ఇద్దరూ వేదికపైనే ఉండగా.. మీడియాతో మాట్లాడుతూ విక్కీ కనిపించారు. ఇక వెంటనే  ఆయన వద్దకు నేరుగా వెళ్లిన సల్మాన్.. ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇరువురూ నవ్వుతూ పలకరించుకున్నారు. ఇక సల్మాన్ అభిమానులు ఊరుకుంటారా..?  ఈ వీడియోను  బాగా వైరల్ చేస్తున్నారు. మరోవైపు తోసేసిన  ఘటనపై విక్కీ కౌశల్ స్పందించారు. కొన్ని సార్లు అనవసర విషయాలు కూడా పెద్దవిగా కనపడతాయి. వీడియోలో కనిపించినట్లుగా అక్కడ అలాంటిదేమీ జరగలేదు. అసలు ఈ విషయం గురించి మాట్లాడటానికి కూడా ఏమీ లేదు అని చెప్పడంతో పాటు.. వివాదం పెద్దది కాకుండా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios