Asianet News TeluguAsianet News Telugu

డ్రామాలు చేయకు.. సల్మాన్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చిన లేడీ జర్నలిస్ట్, స్ట్రాంగ్ కిస్ ఇచ్చిన బాలీవుడ్ హీరో.?

అందురు షాక్ అయ్యేలా పబ్లిక్ లో ఓ పనిచేశారు సల్మాన్ ఖాన్.  ఓ లేడీ జర్నలిస్ట్ కు ఘాటుగా ముద్దు పెట్టాడు. దాంతో షాక్ అయిన ఆమె.. సల్మాన్ ను ఏమన్నదో తెలుసా..? 
 

Bollywood Hero salman khan kissing a journalist video viral JMS
Author
First Published Nov 23, 2023, 1:50 PM IST

సల్మాన్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరుంది సల్మాన్ కు. ఆయన ఖాతాలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. ఘాటు రొమాన్స్ చేస్తాడు అంటూ సల్మాన్ కు బాలీవుడ్ లో ఇమేజ్ కూడా ఉంది. అయితే ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు..? ఏం చేస్తాడు అనేది ఎవరూ ఊహించలేదు. తాజాగా అలాంటి పనే చేశాడు సల్మాన్. సల్మాన్ ఖాన్ చాలా జోవియల్ గా ఉంటారు. అందరితో ఇట్టే కలిసి పోతారు. చక్కగా నవ్వుతూ పలకరిస్తారు. అభిమానులతో మరింత ఫన్ గా ఉంటారు.

 తాజాగా ముంబైలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ ఇండియా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈవేడుకల్లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ లేడీ జర్నలిస్టును ఆయన గట్టిగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సడెన్ గా ఆయన చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇంత స్వతంత్రంగా ఆమెను ముద్దు ఎలా పెట్టుకున్నాడా అని అంతా షాక్ అయ్యారు. అయితే ఆతరువాత తెలిసింది ఆమె తన స్నేహితురాలు అని. 

మోదీపై విమర్షలు, హర్ట్ అయిన కంగనా రనౌత్, నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్.. ఏమంటుందంటే..?

అక్కడ సీనియర్‌ రిపోర్టర్‌ గా ఉన్న తన స్నేహితురాలిని సల్మాన్ ఖాన్ చూశారు. వెంటనే ఆమెను ఆప్యాయంగా పలకరించారు. దగ్గరికి తీసుకుని ను దిటిపై ముద్దు పెట్టారు. ఆమె కూడా సల్మాన్ ను సరదాగా పలకరించింది. అంతె కాదు.. సల్మాన్ ఖాత్ దగ్గర ఉన్న చనువుతో అతన్ని..  డ్రామాలు చేయకు అంటూ అతడి బుగ్గలను నిమిరింది. ఆ తర్వాత సల్మాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వీడియో సోషల్‌ వైరల్‌గా మారింది. 

బాలయ్యపై పగబట్టిన హీరోయిన్లు, అప్పుడు రాధికా ఆప్టే, ఇప్పుడు విచిత్ర.. ఆరోపణల్లో నిజంఎంత...?

సల్మాన్ స్టార్ హీరోగా ఎదిగినా, తన స్నేహితురాలిని గుర్తు పెట్టుకోవడమే కాకుండా.. ఆమెను అంత అప్యాయతగా పలకరించడం అందరిని ఆశ్చర్యపరిచింది అంతే కాదు.. ఈ విడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. సల్మాన్ ను మెచ్చుకుంటున్నారు. సల్మాన్ ఆలివ్ గ్రీన్ కలర్ షర్ట్, లేత గోధుమరంగు రంగు ప్యాంటు ధరించాడు. తాజాగా సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ.376 కోట్లు వసూలు చేసింది. సల్మాన్ ‘టైగర్ 3’లో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios