Asianet News TeluguAsianet News Telugu

మందు, మాంసం మానేసిన రణ్ బీర్ కపూర్, కారణం అదే..?వింటే షాక్ అవుతారు..

బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణ్ బీర్ కపూర్.. ఆహ్కాహాల్ తో పాటు.. మాంసాహారం మానేశాడట. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంత..? అసలు ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు..? 

Bollywood Hero Ranbir kapoor stop drinking Alcohol and eating meat JMS
Author
First Published Oct 10, 2023, 2:56 PM IST | Last Updated Oct 10, 2023, 2:58 PM IST


బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణ్ బీర్ కపూర్.. ఆహ్కాహాల్ తో పాటు.. మాంసాహారం మానేశాడట. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంత..? అసలు ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు..? 

బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో ఇమేజ్ సాధించాడు రణ్ బీర్ కపూర్, ప్లే బాయ్ గా రణ్ బీర్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన నటించిన ప్రతీ సినిమాలో హీరోయిన్ తో రణ్ బీర్ ప్రేమాయణం సాగిస్తాడంటారు. అటువంటి హీరోను.. కట్టిపడేసింది ఆలియా భట్. తన మెడలో మూడు ముళ్లు వేయించుకోవడంతో పాటు.. ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. ఇక  పెళ్ళి తరువాత కూడా బాలీవుడ్ లో అదే ఊపు కొనసాగిస్తున్నారు ఇద్దరు. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రణ్ బీర్ కపూర్. తాజాగా ఆయన యానిమల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈసినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలున్నాయి. 

ఇక తాజాగా  రణబీర్ కపూర్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణ్ బీర్ తాజాగా మద్యం, మాంసాన్ని మానేశారట. అయితే ఆయన ఎందుకు మానేశారు అని అంతా అనుమానం వ్యాక్తం అవుతున్న క్రమంలో అసలు విషయం తాజాగా వెల్లడించారు రణ్ బీర్ టీమ్. రణ్ బీర్ కపూర్ ఆనిమల్ తరువాత రామయణం సినిమా చేయబోతున్నాడు.  నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రామాయణం చిత్రం కోసం రణబీర్ రాముడి  పాత్రను పోషించనున్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నందున, పవిత్రంగా ఉండాలనే ఆలోచనతో రణబీర్ కపూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. 

ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన దక్షిణాది నటి సాయి పల్లవి నటించనుంది. ప్రజల్లో పరపతి కోసం రణబీర్ కపూర్ మద్యం, మాంసానికి దూరంగా ఉండడం లేదని, కేవలం రాముడి పాత్ర కోసమే ఆ పని చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రామాయణం సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాదిలో మొదలు కానుంది. ఫిబ్రవరి నుంచి రణబీర్, సాయి పల్లవితో కూడిన షాట్లు తీయనున్నట్టు తెలుస్తోంది. ఆగస్ట్ వరకు ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. వీఎఫ్ఎక్స్ సేవలను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కంపెనీ డీఎన్ఈజీ అందించనున్నట్టు తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios