Asianet News TeluguAsianet News Telugu

ఇకపై ఆ సినిమాలు చేయను.. రణ్ బీర్ కపూర్ సంచలన నిర్ణయం, షాక్ లో ఫ్యాన్స్

పెళ్లైనప్పటికీ.. రణ్ బీర్ కపూర్ పడిచచ్చిపోయే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇక ఈయంగ్ స్టార్ రీసెంట్ గా ఓ సంచలన నిర్ణయం తీసుకోవడమే కాకుండా ప్రకటించేశాడు కూడా..? ఇంతకీ ఎంటా డెసిషన్. 

Bollywood Hero Ranbir Kapoor Sensational Decision
Author
First Published Dec 14, 2022, 12:45 PM IST

బాలీవుడ్ లో రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరోలో ముందు వరుసలో ఉంటాడు రణ్ బీర్ కపూర్. పెళ్లైనప్పటికీ.. ఆయనంటే పడిచచ్చిపోయే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇక ఈయంగ్ స్టార్ రీసెంట్ గా ఓ సంచలన నిర్ణయం తీసుకోవడమే కాకుండా ప్రకటించేశాడు కూడా..? ఇంతకీ ఎంటా డెసిషన్. 

బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో, ప్లే బాయ్ లాంటింటి ఇమేజ్ లు అన్నీ కలుసున్న యంగ్ స్టార్ అంటే వెంటనే రణ్ బీర్ పేరే వినిపిస్తుంది. ఆయనంటే అమ్మాయిలు పోటీపడుతుంటారు. రణ్ బీర్ కపూర్ చేసే సినిమాలు కూడా రొమాంటిక్ సినిమాలే.  ఇటు హీరోయిన్లు కూడా ఆయనతో ప్రేమలో పడకుండా ఉండలేరు. రణ్ బీర్ కూడా బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. చివరిగా తన ప్రేయసి.. బాలీవుడ్ యంగ్ స్టార్ ఆలియా భట్ ను పెళ్ళి చేసుకుని సెటిట్ అయ్యాడు రీసెంట్ గా. 
ఇక రీసెంట్ గా ఓ సంచలననిర్ణయాన్ని ప్రకటించాడు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.  తాను ఇక నుంచీ రొమాంటిక్‌ కామెడీ మూవీస్‌ చేయనని ప్రకటించారు. దాంతో ఆయన ఫ్యాన్స్.. షాక్ అయ్యారు. ముఖ్యంగా రణ్ బీర్ పై క్రష్ ఉన్న లేడీ ఫ్యాన్స్ చాలా మంది రణ్ బీర్ నిర్ణయంతో షాక్ కు గురయ్యారు. అయితే ఆయన పెళ్ళి చేసుకోవడం వల్లే ఈనిర్ణయానికి వచ్చారన్న మాటలు వినిపిస్తున్న క్రమంలో.. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో క్లారిటీ కూడా ఇచ్చాడు రణ్ బీర్ కపూర్. 

రొమాంటిక్ మూవీ చేసీ చేసీ తాను విసుగు చెందానని, అందుకే ఈ తరహా సినిమాలు చేయదల్చుకోవడం లేదు అని ప్రకటించారు యంగ్ హీరో.  ఇప్పుడు మారిన ట్రెండ్‌కు, తనకున్న ఇమేజ్‌కు లవ్‌స్టోరీస్‌ సెట్‌ కావని ఆయన అన్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రణ్‌బీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక నుంచి మాట్లాడుతూ.. ఆయన ఈ రకంగా ప్రకటన చేశారు. ప్రస్తుతం తాను లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో ఒక రొమాంటిక్‌ కామెడీ మూవీలో నటిస్తున్నానని. ఇక ఇదే నా చివరి రోమ్‌ కామ్‌ అని చెప్పారు రణ్ బీర్. 

ఇకపై ఈ తరహా సినిమాల్లో  నటించను. నా వయసు, ఇమేజ్‌ చూస్తే ఇక లవ్‌స్టోరీస్‌ వద్దనిపిస్తున్నది. ఇప్పటికే ఆలస్యంగా తండ్రినయ్యాను. నా పిల్లలకు ఇరవై ఏండ్లు వచ్చేప్పటికి నేను అరవైలో పడతాను. అప్పుడు నా పిల్లలతో కలిసి ఆటలాడలేను, పరుగులుపెట్టలేనేమో అనిపిస్తున్నది అని సరదాగా వ్యాఖ్యానించారు రణ్ బీర్.  

ప్రస్తుతం రణ్‌బీర్‌ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.  శ్రద్ధా కపూర్‌తో కలిసి లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్న యంగ్ హీరో.. టాలీవుడ్ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో యానిమల్‌  సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ సినిమాలో రణ్‌బీర్‌ గ్రే షేడ్‌ పాత్రలో కనిపించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios