మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, తమన్నా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. 

సైరా చిత్రం ప్రస్తుతం చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్టోబర్ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్ర బిజినెస్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సైరా చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్ర హిందీ హిందీ హక్కులని స్టార్ హీరో ఫరాన్ అక్తర్ దక్కించుకున్నారు. ఫరాన్ అక్తర్ కు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ సైరా హిందీ హక్కులని భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఉండడం హిందీ వర్షన్ కు కలసి వచ్చే అంశం. తాజాగా ఫరాన్ అక్తర్ కూడా సైరా ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కావడం ఆసక్తికరంగా మారింది. ఇక హిందీలో సైరా చిత్ర పబ్లిసిటీకి డోకా లేదని అంటున్నారు.