‘బాహుబలి’ మూవీ తరువాత ప్రభాస్ నటించిన మూవీ ‘సాహో’. సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన యాక్షన్ మూవీ ఈ రోజు (ఆగస్టు 30) తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అయ్యింది. అయితే రిలీజ్ కు ముందు ఉన్న పాజిటివ్ బజ్‌తో  ఒక్కసారిగా మాయమైంది. అన్ని వైపుల నుంచి ఈ సినిమా డిజాస్టర్ అన్న టాక్ స్ప్రెడ్ అయ్యిపోయింది. అయితే పెద్ద సినిమాలకు అలా జరగటం ఒక్కోసారి కామన్ కాబట్టి పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. భారీగా వర్కవుట్ అవుతాయనుకున్న కొన్ని ఫాక్టర్స్ మిజరబుల్ గా ఫెయిలవ్వటం జరిగింది. అయితే ఈ ఫ్లాఫ్ కొంతమందిని ఆనందంలో ముంచెత్తుతోందని కథనాలు వస్తున్నాయి.

ఈ సినిమా రిలీజ్ కోసం మనకన్నా ఎక్కువగా బాలీవుడ్ ప్రేక్షకులు చూసారు. ఎందుకంటే  `బాహుబలి` స్టార్ ప్రభాస్ దూసుకొస్తున్నాడు అంటూ గత కొంతకాలంగా ముంబై మీడియా  ఓ రేంజిలో ప్రచారం చేస్తోంది. మరికొంత కాస్త ఉత్సాహం ఎక్కువై ఖాన్ ల రికార్డుల్ని కొట్టేయబోతున్నాన్నాడు అన్నారు. ఆ మీడియా  మన ప్రభాస్ కి బోలెడంత అండగా నిలిచిందని సంబరపడేలోపలే కావాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇది చాలా మంది బాలీవుడ్ స్టార్స్ అభిమానులకు మండేలా చేసింది. వాళ్లు సైలెంట్ గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపధ్యంలో సినిమాలో కంటెంట్ లేకపోవటంతో వెలాతెలాపోయింది. ఇఫ్పుడు వారికి అదే ఆనందానికి కారణమవుతోందిట. సోషల్ మీడియాలో సాహో పై ఓ రేంజిలో చెలరేగిపోతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఖాన్స్ తో పోటీ పడేటంత గొప్పవాడా  ప్రభాస్ అంటూ విరుచుకుపడుతున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమాని చెత్త సినిమా అంటూ తీసిపారేస్తున్నారు. ఇది ఇంకా ఆనందాన్ని కలగచేస్తోంది ఆ ఫ్యాన్స్ కు. అదృష్టవశాత్తు తెలుగులో ఆ కల్చర్ ఇంకా మొదలు కాలేదు.