బాలీవుడ్ లో నెంబర్ వన్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు కపిల్ శర్మ.. అదిరిపోయే అదిరిపోయే పంచ్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్వించే కపిల్ లైఫ్ లో ఏడిపించే విషాదాలు ఎన్నో.. కాని ఆ నవ్వుల మాటున వాటిని దాచి.. నలుగురిని సంతోషపెడుత్న్నాడు. ఇక రీసెంట్ గా తన లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు కపిల్ శర్మ. ఆయన ఏమన్నారంటే..?  

అందరిని నవ్విస్తున్నారు కాబట్టి కమెడియన్స్ లైఫ్ లో అంతా నవ్వులే ఉంటాయి అనుకోకూడదు. ఎందుకుంటే ఆనవ్వుల వెనుక ఎంతో విషాదం నింపుకుని ఉన్నవారు కూడా లేకపోలేదు. ఇక అలాంటివారిలో బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కూడా ఒకరు. బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియాన్ ఆడియన్స్ అందరిని తన కామెడీ పంచ్ లతో నవ్విస్తూ.. సందడి చేస్తుంటారు కపిల్ శర్మ. ముఖ్యంగా కపిల్ శర్మ షో ద్వారా స్టార్ సెలబ్రిటీలను కూడా ఓ ఆట ఆడుకుంటూ.. ఎంటర్టైన్ చేస్తున్నారు. అంతే కాదు సినిమా ప్రమోషన్ల కోసం పెద్ద పెద్ద స్టార్లు కూడా ది కపిల్‌శర్మ షో కి క్యూ కట్టాల్సిందే. అలాంటి కపిల్ శర్మ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను, గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారట. 


తాను ఒంటరి తనాన్ని అనుభవించానని, చచ్చిపోవాలని అనుకున్నానని అంటున్నారు కపిల్. ఆయన నటించిన జ్విగాటో సినిమా.. త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సంస్థతో కపిల్ వర్మ మాట్లాడారు. ఈసందర్భంగా తన జీవితంలోని చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఐదేళ్ల కిందట తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని సంచలన వ్యాఖ్యాలు చేవారు కపిల్ శర్మ. 2017 లో తాను డిప్రషన్ కు వెళ్లిపోయినట్టు వెల్లడించిన కపిల్ శర్మ.. ఫిరంగిసినిమా సరిగ్గా ఆడకపోవడంతో బాగా డిస్సపాయింట్ అయ్యాన్నారు. దానికి తోడు తన తోటి కమెడియన్ సునీల్ గ్రోవర్ తో ఏర్పడిన వివాదం తనను కంగదీసిందంటూ చెప్పుకొచ్చారు.


తన డిప్రెషన్ ఎంత వరకూ వెళ్ళిందంటే.. అది తట్టుకోలేక ఒంటరిని అయ్యానన్న ఫీలింగ్ లోకి వెళ్లిపోయానని, చనిపోదామని అనుకున్నానని కపిల్ శర్మ చెప్పారు. ఓ సెలబ్రిటీగా కోట్ల మందికి మీరు తెలిసి ఉంటారు. మీరు వాళ్లను అలరిస్తారు. కానీ ఇంటికి వెళ్లిన తర్వాత.. అక్కడ ఒంటరిగా ఉంటారు. కనీసం బయటికి వెళ్లి.. బీచ్‌లో కూర్చుని సముద్రం వైపు చూసే సాధారణ జీవితం గడిపే పరిస్థితి కూడా లేదు. రెండు గదుల ఫ్లాట్‌లో ఉంటూ.. బయటి చీకటిని చూస్తున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నేను వివరించలేను అని అన్నారు కపిల్ శర్మ. అంతే కాదు కష్టసుఖాలు చెప్పుకునేవారు లేక మానసికంగా వత్తిడికి గురయ్యానని అన్నారు. అప్పుడు కూడా తనను పట్టించుకునేవారు లేరని వాపోయారు కపిల్. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత.. బాధ, సంతోషం ఏదైనా కొంతవరకే ఉంటాయని అర్థమైందని అన్నారు కపిల్ శర్మ.