మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న నటి సురేఖ సిక్రి నేడు మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు ఉదయం ఆమె గుండెపోటుతో మరణించారు. కెరీర్ అద్భుత పాత్రలు చేసిన సురేఖ సిక్రి మృతి బాలీవుడ్ ని తీవ్ర విషాదంలో నింపివేసింది. 

 చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. నీనా గుప్తా, అవికా గోర్, మనోజ్ బాజ్ పాయ్ తో పాటు బాలీవుడ్ నటులు సంతాపం ప్రకటించారు. 

అవికా గోర్.. గొప్ప నటి మాత్రమే కాదు మంచి మానవతావాది అంటూ సురేఖ సిక్రిని కొనియాడారు. 

View post on Instagram

వెండితెరపై సురేఖ గారిని చూడడం పెద్ద ట్రీట్ అంటూ మనోజ్ బాజ్ పాయ్ తన ట్వీట్ లో పొందుపరిచారు. అద్భుత ప్రదర్శనలు మన కోసం వదిలివెళ్లారని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

పరిశ్రమలో అలాంటి ఉత్తమ నటి మరొకరు లేరంటూ దియా మీర్జా సంతాపం ప్రకటించారు. 

Scroll to load tweet…

ఆమె నటన చూస్తూ పెరిగానని, ఆమె సాటిలేని నటి అంటూ నటుడు ఆశిష్ విద్యార్థి తన ట్వీట్ లో పేర్కొన్నాడు. అలాగే ఆమెకు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. 

Scroll to load tweet…