షారుఖ్ ఖాన్ నెంబర్ సెంటిమెంట్, బాలీవుడ్ బాద్ షా లక్కీ నెంబర్ ను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్..
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. అందరికి ఏదొఒక సెంటిమెంట్ ఉంటుంది..కొంత మందికి లక్కీ నెంబర్ కూడా ఉంటుంది. సెలబ్రిలీట లక్కీ నెంబర్లు.. సెంటిమెంట్ నెంబర్ల గురించి అరుదుగా తెలుస్తుంటుంది. తాజాగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

ప్లాప్ ల నుంచి బయటపడి.. వరుసగా ఇండస్ట్రీ హిట్లు ఇస్తున్నాడు కింగ్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan). బాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ కొన్ని విలువైన పేజ్ లు సంపాదించుకున్నారు షారుఖ్. నాలుగైదేళ్లు సినిమాలకు దూరంగా ఉనన షారుఖ్.. రీ ఎంట్రీతో ఇండస్ట్రీని అదరగొట్టాడు. పూర్తిగా పడిపోయిన బాలీవుడ్ కు ఊపిరి ఊదాడు. పఠాన్ సినిమాతో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన షారుఖ్.. తాజాగా జవాన్ సినిమాతో వాటిని తిరగరాశాడు. ఈ సినిమాతో భారీ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటు ఎంతో విజయవంతంగా దూసుకుపోతుంది.ఇలా ఈ సినిమా ద్వారా షారుక్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు.
పటాన్ సినిమాతో దాదాపు 1,000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిన షారుఖ్ ఖాన్(Shah Rukh Khan).. వెంటనే జవాన్ సినిమాతో అంతకుమించి సాధించాడు. వరుసగా రెండు బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. కాని ఈసారి సౌత్ ను గట్టిగా టార్గెట్ చేశాడు షారుఖ్ ఖాన్. సౌత్ డైరెక్టర్.. సౌత్ హీరోయిన్.. సౌత్ స్టార్స్.. సౌత్ మ్యూజిక్ డైరెక్టర్.. అది కూడా తమిళం నుంచే తీసుకుని పాన్ ఇండియా మార్కెట్ ను సాధించాడు షారుఖ్.
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నయనతార షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జంటగా నటించిన ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు కూడా ప్రశంశల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా షారుఖ్ ఖాన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ హీరోల మాదిరిగానే ఈయనకు కూడా కొన్ని సెంటిమెంట్లో ఉన్నాయని ఆ సెంటిమెంట్లను షారుక్ తప్పకుండా ఫాలో అవుతారని సమాచారం.
షారుక్ ఖాన్ సినిమాలో పరంగా కాకపోయినా ఆయన ఏదైనా ఒక వస్తువును కొన్నా.. ఏదైనా వెహికిల్ కొన్నా.. ఒక కారును కొనుగోలు చేసినా.. అందులో తప్పనిసరిగా ఒక నెంబర్ ఉండాలని భావిస్తారట.. ఆ నెంబర్ 555 అని తెలుస్తోంది. ఇలా షారుఖ్ ఖాన్ సైతం నెంబర్ సెంటిమెంటును పాటిస్తారని బాలీవుడ్ సమాచారం. షారుక్ ఖాన్ 555 నెంబర్ సెంటిమెంట్ ఎప్పటి నుంచో పాటిస్తున్నారట.
ఈయన మొబైల్ నెంబర్ నుంచి మొదలుకొని తను కొనుగోలు చేసే కార్ల వరకు కూడా ఇదే నెంబర్ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటారట ఈ నెంబర్ తనకు చాలా అదృష్టం తీసుకువచ్చిందని అందుకే ఈ నెంబర్ తన కార్ల విషయంలోనూ మొబైల్ నెంబర్ విషయంలోనూ ఉండేలాగే షారుఖ్ ఖాన్ జాగ్రత్త పడతారని తెలుస్తోంది. అయితే షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులకు కూడా ఈయన నంబర్ సెంటిమెంటును అనుసరిస్తారని తెలుస్తోంది.