ఇండియన్‌ క్రికెటర్‌ హార్ధిక పాండ్యా తన ఆట తీరుపాటు తరుచూ వివాదాలతోనూ వార్తల్లో ఉంటుంటాడు. ప్రస్తుతం పెళ్లి కాకుండానే తండ్రి అవుతూ మరో సారి న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు ఈ యువ క్రికెటర్‌. అయితే క్రికెటర్‌గానే కాదు ఫిట్‌నెస్‌ విషయంలో కూడా హార్థిక్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాడు. తాజాగా ఈ ఆల్ రౌండర్‌ పుష్‌ అప్స్‌ చేస్తున్న తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్  చేశాడు.

ఈ వీడియోతో పాటు `స్ట్రాంగర్‌, ఫిట్టర్‌, ఇంకా తయారవుతున్నా.` అంటూ తన సోదరుడు కృణాల్ పాండ్యాను అదే ఎక్సరసైజ్‌ చేయాల్సిందిగా చాలెంజ్‌ చేశాడు. అయితే ఈ వీడియోపై హర్దిక్‌తో డేటింగ్ లో ఉన్న నటాసా స్టాంకోవిక్‌తో పాటు పలువరు బాలీవుడ్‌ హీరోయిన్లు రియాక్ట్ అయ్యారు. హాట్‌ బ్యూటీస్‌ సయామీ ఖేర్‌, కరిష్మా తనా లాంటి వారు ఈ వీడియోపై స్పందించారు.

దిస్‌ ఈజ్‌ ఇన్‌సానే అంటూ సయామీ ఖేర్‌ స్పందించగా.. కరిష్మా వావ్‌ నువ్వు ఇది ఎలా చేయగలిగావ్‌ అంటూ కామెంట్‌ చేసింది. హర్థిక్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ సటసా కండలు చూపిస్తున్న ఎమోజీలతో పోస్ట్ చేసింది. గత నెలలో హర్దిక తనకు కాబోయే భార్య తల్లి కాబోతున్నట్టుగా ప్రకటించాడు. ఆ తరువాత నటసా గర్బవతిగా ఉన్న ఫోటోలు వరుసగా పోస్ట్ చేస్తూ వస్తున్నాడు.