చిరు కోసం హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్!

First Published 1, Aug 2018, 4:19 PM IST
Bollywood actress to feature in Chiranjeevi's next film
Highlights

చిరు మాత్రం త్రిష, లేదా అనుష్క వంటి సీనియర్ హీరోయిన్లను తీసుకుంటే బాగుంటుందని సూచించినా.. కొరటాల ఆలోచనలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. చిరు కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టం అవుతోంది. అందుకే కొందరు హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవికి కూడా ఇలాంటి సమస్యే వచ్చినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు చిరు పక్కన హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనేది ప్రశ్నగా మారిపోయింది.

కాజల్ తో కలిసి 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో నటించారు. 'సై రా' సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. మళ్లీ వారినే కొరటాల తన సినిమాలో హీరోయిన్ గా రిపీట్ చేయడానికి ఇష్టపడడం లేదు. చిరు మాత్రం త్రిష, లేదా అనుష్క వంటి సీనియర్ హీరోయిన్లను తీసుకుంటే బాగుంటుందని సూచించినా.. కొరటాల ఆలోచనలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. చిరు కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల.

బాలీవుడ్ లో టీవీ సీరియళ్ల ద్వారా ఫేమస్ అయిన కొందరు లీడ్ ఆర్టిస్ట్ లను అలానే ముప్పై ఏళ్ళు దాటిన మోడల్స్ కొందరిని ఆడిషన్ చేయాలనుకుంటున్నారు. వారిలో ఒకరిని హీరోయిన్ గా ఫైనల్ చేయాలనుకుంటున్నారు. కొరటాల గనుక నిర్ణయించుకుంటే చిరంజీవి కూడా కాదనే ఛాన్స్ లేదు. సో.. ఈసారి చిరంజీవీ సినిమాలో కొత్త హీరోయిన్ ను చూడడం ఖాయమనిపిస్తోంది. 

loader