ఇజ్రాయిల్ యుద్ధంలో చిక్కుకున్న నటి.. క్షేమంగా ఇండియాలో ల్యాండింగ్
తాజాగా నుస్రత్ క్షేమంగా ఇండియాకి చేరుకుంది. తన టీమ్ తనకు టచ్‌లోకి రావడంతో ఆమె క్షేమంగా ఇండియాకి చేరుకోగలిగాను అని తెలిపింది నుస్రత్.
ప్రముఖ నటి నుస్రత్ బరూచా ఇటీవల ఇజ్రాయిల్ యుద్ధంలో చిక్కుకుంది. అక్కడ ఆమె హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు వెళ్లింది. అయితే పాలస్తీనాతో ఇజ్రాయిల్‌కి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అందులో నటి నుస్రత్ తప్పిపోయింది. దీంతో యుద్ధంలో ఆమె చిక్కుకుందనే వార్తలు బయటకొచ్చాయి. తన టీమ్‌తో ఆమెకి సంబంధాలు తెగిపోవడంతో అంతా ఆందోళన చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా నుస్రత్ క్షేమంగా ఇండియాకి చేరుకుంది. తన టీమ్ తనకు టచ్‌లోకి రావడంతో ఆమె క్షేమంగా ఇండియాకి చేరుకోగలిగాను అని తెలిపింది నుస్రత్. ఆదివారం ఆమె ముంబయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ లో ఆమెకి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే తాను మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించింది. కొంత టైమ్ కావాలని తెలిపింది. ఆమెలో భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. దీంతో ఇంకా ఆమె ఆ యుద్ధానికి సంబంధించిన షాక్‌లోనే ఉందని తెలుస్తుంది.
హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆమె ఇటీవల ఇజ్రాయెల్ వెళ్లారు. ఆ దేశానికీ, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆమె తప్పిపోయింది. ఆమె టీమ్ తో కూడా కమ్యూనికేషన్ తెగిపోవడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆమెను కనిబెట్టేందుకు టీమ్ తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి కమ్యూనికేషన్ జరగడంతో ఆమె ఇజ్రాయెల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే డైరెక్ట్ గా ఇండియాకు విమాన సర్వీసు అందుబాటులో లేకపోవడంతో కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా స్వదేశానికి చేరుకున్నారు నుస్రత్.