ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం అతలాకుతలం అవుతోంది. సామాన్యులు వర్షాలకు నరకం అనుభవిస్తుంటే.. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ముంబై వర్షాల కారణంగా విమానాలు రద్దు కావడంతో తనకు ఎయిర్ పోర్ట్ లో ఇరుక్కుపోయినట్లు రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. స్టార్ హీరో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, కృతి సనన్ లాంటి సెలెబ్రిటీలు కూడా వర్షాల కారణంగా చేదు అనుభవం ఎదుర్కొన్నారు. 

అక్షయ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో లండన్ వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి వెళ్ళాడు. కానీ వర్షాలకు 48 గంటల పాటు విమాన సేవలు నిలిపివేయడంతో ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి తిరుగుముఖం పట్టినట్లు ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో పేర్కొంది. 

యంగ్ హీరో వరుణ్ ధావన్ కారు ఓ రోడ్డులోని ఓ వరదలో చిక్కుకుపోయింది. వరద నీటిలోనే కారుని నెమ్మదిగా నడుపుకుంటూ ఇంటికి చేరినట్లు వరుణ్ తెలిపాడు. హాట్ బ్యూటీ కృతి సనన్ కూడా విమానాశ్రయంలో చిక్కుకుపోయింది.