బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతి గురుదాస్ పూర్ ఎంపీగా ఎన్నికైన వినోద్ ఖన్నా వినోద్ ఖన్నాకు సతీమణి కవిత ఖన్నా కుమారులు అక్షయ్ ఖన్నా,రాహుల్ ఖన్నా కూతుర్లు సాక్షి ఖన్నా, శ్రద్ధా ఖన్నా
ప్రముఖ బాలీవుడ్ నటుడు, గురుదాస్ పూర్ ఎంపీ 'వినోద్ ఖన్నా' మృతి చెందారు. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో వినోద్ ఖన్నా క్యాన్సర్ తో బాదపుడుతున్నారన్న వార్తలు వినిపించినా కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. ఆయన డీ హైడ్రేషన్ కారణంగానే ఆసుపత్రిలో చేరినట్టుగా తెలిపారు.
1968లో సినీ రంగ ప్రవేశం చేసిన వినోద్ ఖన్నా తనదైన నటన..డైలాగ్స్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తరువాత హీరోగా మారారు. ఆయన చివరి చిత్రం 'దిల్ వాలే'. నటుడిగానే కాక రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు వినోద్ ఖన్నా.. 2002లో వాజ్ పాయ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. 2014లో గురుదాస్ పూర్ నుంచి ఎంపికగా ఎన్నికయ్యారు. వినోద్ ఖన్నాకు సతీమణి కవిత ఖన్నా, కుమారులు అక్షయ్ ఖన్నా,రాహుల్ ఖన్నా, కూతుర్లు సాక్షి ఖన్నా, శ్రద్ధా ఖన్నా. ఎనభై ఏళ్ల వయసున్న వినోద్ ఖన్నా బాలీవుడ్ లో 141 సినిమాల్లో నటించారు.
