దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ఎమ్మెస్ ధోనీ సినిమాలో సందీప్ నటించాడు. అందులో ధోనీ స్నేహితుడిగా నటించాడు సందీప్. సిక్కు యువకుడి పాత్రలో ధోనీని ఎంకరేజ్ చేసే స్నేహితుడిగా నటించాడు సందీప్. ధోనీ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సందీప్ నహర్. ఆ తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కేసరిలో కూడా అద్భుతమైన పాత్రలో నటించాడు. ఆత్మహత్య చేసుకునేముందు  సోషల్ మీడియాలో తను చనిపోతున్నట్లు పోస్టు చేశాడు. వ్యక్తిగతంగా, వృత్తిరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, అందుకే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో సందీప్‌ పేర్కొన్నాడు. 

తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆ వీడియోలో తెలిపారు. తన చావుకు ఎవరూ కారణం కాదని అన్నారు. 10 నిమిషాల నిడివి గల ఆ వీడియోలో చాలా అంశాలను ప్రస్తావించారు. పెళ్లి తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో వివరించారు.  తన భార్య కాంచన్ శర్మ గురించి ఆరోపించాడు సందీప్. తన భార్య చాలా దారుణంగా ప్రవర్తిస్తుందని.. ప్రతీ రోజూ ఏదో ఓ విషయంలో తనతో గొడవ పడుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. దాంతో ఇటు వ్యక్తిగత జీవితంలో అటు వృత్తి రీత్యా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు సందీప్ నహర్ తన సూసైడ్ నోట్‌లో తెలిపారు. 

అలాగే తన ఆరోగ్యం కూడా దెబ్బ తింటోందని.. అలాగే తన కెరీర్ కూడా పాడైపోతుందని ఆరోపణలు చేసాడు. అందుకే తన లైఫ్ ఎండ్ చేసుకోవాలని భావించినట్లు చెప్పుకొచ్చాడు సందీప్ నహర్. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. భార్య గురించి అనేక ఆరోపణలు చేసిన సందీప్.. తన మరణానికి ఆమె కారణం కాదని స్పష్టం చేశారు.  దాంతో పాటు సూసైడ్ నోట్ కూడా హిందీలో రాసి పెట్టాడు. తన మరణానికి కారణం వ్యక్తిగత కారణాలే అని చెప్పుకొచ్చాడు.

 ముంబై గుర్గావ్‌లోని తన ఇంట్లోనే ఈయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సందీప్ నహర్ నివాసం నుంచి ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నరు. అయితే సందీప్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.