ఫిట్ నెస్ విషయంలో సెలబ్రెటీలు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో... ఎలాంటి ఫుడ్ డైట్ మెయింటెయిన్ చేస్తారో తెలిసిందే. కానీ బాలీవుడ్ నటుడు బాయ్ పేయ్ చెప్పిన మాటలు వింటే.. అతని డెడికేషన్ కు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే... 

నేషనల్ అవార్డు గ్రహీత ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయ్ Manoj Bajpayee తెలుగు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు దక్కించుకున్నారు. సమంత నటించిన2 ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో మనోజ్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన నటనతో సౌత్ ఆడియెన్స్ కూడా బాగా క్రేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా సమయం ప్రముఖ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. 

ఈ క్రమంలో మనోజ్ బాజ్ పేయ్ తన జీవితంలోని ఓ సీక్రెట్ ను ఈరోజు బయటపెట్టారు. తన ఫుడ్ డైట్, హెల్త్ గురించి తీసుకునే జాగ్రత్తలపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. మనోజ్ బాజ్‌పేయి ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారన్నారు. 14 సంవత్సరాలుగా రాత్రి భోజనం చేయలేదంట. తాను డిన్నర్‌లను ఎందుకు వదులుకున్నానన్న కారణాన్ని ఆయన వెల్లడించారు. తను వ్యాయామానికి కూడా చాలా ప్రాముఖ్యతనిస్తానని చెప్పారు. అందుకే కొన్ని నియమాలు పాటిస్తానని చెప్పుకొచ్చారు. 

మనోజ్ మాట్లాడుతూ.. బరువు పెరగడం, అనారోగ్యాల విషయానికి వస్తే ఆహారమే అతిపెద్ద శత్రువు అన్నారు. మీరు రాత్రి భోజనం చేయడం మానేస్తే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం పాటు అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండోచ్చని తెలిపారు. తనకు ఆహారం అంటే ఇష్టం ఉన్నా తీసుకోవడం తగ్గించానన్నారు. ఆహారం మనకు అతి పెద్ద స్నేహితుడు, అలాగే మనకు అతి పెద్ద శత్రువు కూడానూ అని వివరించారు. తను రాత్రి తినడం మానేశానని, పగటిపూట సమతుల్య ఆహారం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దాంతో నా ఫిట్‌నెస్‌ కు సహకారంగా ఉంటుందన్నారు. 

ఇక మనోజ్ బాజ్‌పేయ్ తన రాబోయే వెబ్ సిరీస్ 'కిల్లర్ సూప్' ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఇలాంటి విషయాలను పంచుకున్నారు. 54 ఏళ్లలోనూ మనోజ్ ఇంత ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండానికి ఆయన పాటించే డైట్ సీక్రెట్ ను వివరించారు. ఈ Killer Soup వెబ్ సిరీస్ ను అభిషేక్ చౌబే దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల కానుంది. ఈ సిరీస్‌లో తొలిసారిగా మనోజ్ బాజ్‌పేయ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు.