ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ మ్యానియా స్టార్ట్ అయ్యింది. సినిమా ప్రిమియర్ షోలతో ఫ్యాన్స్ లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. సినిమాపై అంతటా పాజిటీవ్ టాక్ వస్తున్న క్రమంలో.. ట్రిపుల్ ఆర్ పై బాలీవుడ్ యాక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ మ్యానియా స్టార్ట్ అయ్యింది. సినిమా ప్రిమియర్ షోలతో ఫ్యాన్స్ లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. సినిమాపై అంతటా పాజిటీవ్ టాక్ వస్తున్న క్రమంలో.. ట్రిపుల్ ఆర్ పై బాలీవుడ్ యాక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ట్రిపుల్ ఆర్ తో మరో చరిత్ర సృష్టిస్తున్నారు జక్కన్న టీమ్. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు(మార్చ్ 25) రిలీజ్ అయిన సినిమా ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. సీతరామారాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్.. ఓ పాపకోసం సాగిన కథతో ట్రిపుల్ ఆర్ దుమ్ము రేపుతోంది. ప్రంపచ వ్యాప్తంగా కామన్ ఆడియన్స్ తో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా ట్రిపుల్ ఆర్ పై తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.
అందరూ పాజిటీవ్ గా స్పందిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్, క్రిటిక్.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన కెఆర్కే మాత్రం సినిమాపై మండి పడ్డారు. రాజమౌళిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన KRK ఆర్ఆర్ఆర్ పరమ చెత్త సినిమా అంటూ ట్వీట్ చేశారు. ఈసినిమా చేయడం తప్పు మాత్రమే కాదని.. 600 కోట్ల ఖర్చుతో ఇంత చెత్త సినిమా చేసినందుకు డైరెక్టర్ రాజమౌళికి కనీసం 6 నెలలు జైలు శిక్ష వేయాంటూ వివాదాస్పదంగా ట్వీట్ చేశాడు కమల్ రషిద్ ఖాన్. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతే కాదు భారతదేశ చరిత్రలో ఇలాంటి ధారుణమైన సినిమా రాలేదన్నారు రషీద్. సినిమా హిస్టరీలోనే ఇది చెత్త సినిమా అంటూ నోరు పారేసుకున్నాడు ఖాన్. ఈ సందర్భంగా మరికొన్ని అత్యంత ధారుణమైన వ్యాఖ్యలు చేశారు కమల్. ఈ సినిమా మనిషి మెదుడు కణాలను నాశనం చేస్తుందంటూ ట్వీట్ చేశారు బాలీవుడ్ యాక్టర్.
