బాలీవుడ్ స్టార్ విక్కీ కౌషల్ Vicky Kaushal ఆరేళ్ల తర్వాత తన గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చెప్పుకొచ్చారు. తను తానే ఐదురోజులు గదిలో బంధించుకున్నట్టు తెలిపారు. ఇంతకీ ఎందుకు? అనే విషయానికొస్తే.. 

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌషల్ ప్రస్తుతం హిందీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాజాగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ Shah Rukh Khan స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన ‘డుంకీ’ Dunki చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మొదటి నుంచి విక్కీ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ వస్తున్నారు. ప్రస్తుతం మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 

అయితే రీసెంట్ ఇంటర్వ్యూల్లో విక్కీ కౌషల్ తన గురించి, తను చేసే సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకొచ్చారు. 2016లో విక్కీ కౌషల్ నుంచి వచ్చిన చిత్రం రామన్ రాఘవ్ 2.0 Raman Raghavan 2.0. ఈ సినిమా కోసం తాను చేసిన కఠినమైన కసరత్తుల గురించి విక్కీ కౌశల్ వివరించారు. ఈ చిత్రంలో ఏసీపీ రాఘవన్ 'రాఘవ్' సింగ్ ఉంబీ పాత్రలో నటించారు. అయితే ఆ పాత్ర తాలుకూ భావోద్వేగాలను పలికించేందుకు ఐదు రోజుల పాటు ఇంట్లో తనను తను బంధించికున్నట్టు చెప్పారు. 

అయితే ఈ విషయాన్ని తన చేసిన కసరత్తుల గురించో.. ఆ పాత్ర గురించో గొప్ప చెప్పడానికి చెప్పట్లేదని.. నటుడిగా ఏదైనా కొత్తదాన్ని అన్వేషించాలనుకుంటే, మనం ఉండేదానికి భిన్నంగా ఏదైనా చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు మనం రెగ్యులర్ లైఫ్‌లో చేయని చేసేలా ఉండాలని, ఆ విధంగా.. ఆ పాత్రలాగే ఆలోచించాలని వివరించారు. విక్కీ కౌషల్ తన సినిమాల పట్ల అంకింతభావంతో ఉంటారో ఈ కామెంట్స్ తో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విక్కీ ‘మేరే మెహబూబ్ మేరే సనమ్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక విక్కీ కౌషల్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) భర్త అనే విషయం తెలిసిందే. 2021లో వీరిద్దరు వివాహ బంధంలో అడుగుపెట్టారు.