Asianet News TeluguAsianet News Telugu

యానిమల్ విలన్ కంగువాలో ఇలా... గూస్ బంప్స్ లేపారుగా!

సూర్య హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న కంగువా మూవీ నుండి మెయిన్ విలన్ లుక్ రివీల్ చేశారు. బాబీ డియోల్ విలన్ బర్త్ డే నేపథ్యంలో ఆసక్తికర అప్డేట్ వదిలారు. 
 

boby deol birthday special first look from suriya starer kanguva ksr
Author
First Published Jan 27, 2024, 12:48 PM IST

హీరో సూర్య కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది కంగువా. ఇది ఫాంటసీ యాక్షన్ డ్రామాగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నాడు. మాస్ చిత్రాల దర్శకుడైన శివ నుండి వస్తున్న వినూత్న చిత్రం ఇది. ఈ చిత్ర ఫస్ట్ లుక్, ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా కంగువా చిత్రంలో బాబీ డియోల్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర పేరు ఉధిరన్. నేడు బాబీ డియోల్ బర్త్ డే నేపథ్యంలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

వందల మంది ఆడవాళ్లు ఆయన్ని చుట్టూ చేరగా ఉధిరన్ తన్మయత్వంలో ఉన్నాడు. ఉధిరన్ లుక్ చూశాక కంగువా చిత్రంలో బాబీ డియోల్ పాత్ర పై ఆసక్తి పెరిగింది. యానిమల్ మూవీతో బాబీ డియోల్ విపరీతమైన క్రేజ్ రాబట్టాడు. కనిపించేది కొన్ని సన్నివేశాలలోనే అయినా ప్రేక్షకుల మదిలో ముద్ర వేసేలా ఆ పాత్ర తీవ్రత ఉంటుంది. 

ఇక కంగువ చిత్రంతో బాబీ మరోసారి సంచలనం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సూర్యకు జంటగా దిశా పటాని నటిస్తుంది. కంగువా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios