ఎంత చిన్న దర్శకుడైనా ఈ రోజుల్లో ఒక సినిమాను తెరకెక్కించడానికి మినిమమ్ ఏడాదిన్నర సమయాన్ని తీసుకుంటున్నాడు. ఇక కాస్త పెద్ద హీరోలతో వర్క్ చేసే దర్శకులైతే మూడేళ్లకో సినిమా చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అందుకే నిర్మాతగా మారి నచ్చిన కథలను స్పీడ్ గా ఆడియెన్స్ కి అందిస్తున్నారు. 

ప్రస్తుతం దర్శకుడు బాబీ కూడా నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఓ వైపు దర్శకుడిగా తన పని తాను చేసుకుంటూనే నిర్మాతగా కూడా వ్యవహరించాలని అనుకుంటున్నాడు. జై లవ కుశ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బాబీ ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఇక అరుణ్ పవర్ అనే యువ దర్శకుడితో ఒక కొత్త సినిమాను నిర్మించాలని బాబీ సిద్దమయ్యాడు. ఆ కథలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా అరుణ్ వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద సినిమాను కూడా డైరక్ట్ చేశాడు. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ కథకు సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.