Asianet News TeluguAsianet News Telugu

'బ్లఫ్ మాస్టర్' ట్విట్టర్ రివ్యూ..

తమిళంలో విజయవంతమైన 'శతురంగ వేట్టై' సినిమా ఆధారంగా బ్లఫ్ మాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. సత్యదేవ్, నందితాశ్వేతా జంటగా గోపి గణేష్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్ళై ఈ సినిమాను నిర్మించారు. 

bluff master movie review
Author
Hyderabad, First Published Dec 28, 2018, 10:05 AM IST

తమిళంలో విజయవంతమైన 'శతురంగ వేట్టై' సినిమా ఆధారంగా బ్లఫ్ మాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. సత్యదేవ్, నందితాశ్వేతా జంటగా గోపి గణేష్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్ళై ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ సరైన సినిమాలు లేక వెలవెలబోతోంది. థియేటర్ లో ఉన్న సినిమాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు.. ఇక భారీ సినిమాలు రావాలంటే మరో రెండు వారాలా సమయంలో ఉంది.

మరి ఆ గ్యాప్ ని బ్లఫ్ మాస్టర్ పూరించగలదా..? అనే ప్రశ్న ఎదురవుతోంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఇప్పుడు ఆ కోవలోకి బ్లఫ్ మాస్టర్ కూడా చేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. రెండు వారాల పాటు సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేయడం ఖాయం.  

Follow Us:
Download App:
  • android
  • ios