కెజిఎఫ్ 2 చిత్రం నుండి ప్రకాష్ రాజ్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. విజయేంద్ర ఇంగల్గి కెజిఎఫ్ 2లో ప్రకాష్ రాజ్ పాత్ర పేరుగా పరిచయం చేశారు చిత్ర యూనిట్. అలాగే ఆ పాత్రకు ఎల్ డొరాడోకు అసలు సంబంధం ఏమిటీ? దానిని ఇతడు నమ్మేవాడా? వ్యతిరేకించే వాడా? అంటూ కొన్ని ఫజిల్స్ వదిలారు.  

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. కాగా కెజిఎఫ్ 2 చిత్రం నుండి ప్రకాష్ రాజ్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. విజయేంద్ర ఇంగల్గి కెజిఎఫ్ 2లో ప్రకాష్ రాజ్ పాత్ర పేరుగా పరిచయం చేశారు చిత్ర యూనిట్. అలాగే ఆ పాత్రకు ఎల్ డొరాడోకు అసలు సంబంధం ఏమిటీ? దానిని ఇతడు నమ్మేవాడా? వ్యతిరేకించే వాడా? అంటూ కొన్ని ఫజిల్స్ వదిలారు. 


సినిమాలో కీలకమైన పాత్ర ప్రకాష్ రాజ్ చేస్తున్నారని నేటి ప్రకటనతో అర్థం అయ్యింది. మొదటి భాగంలో ప్రకాష్ రాజ్ నటించలేదు. కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం ఆయనను తీసుకోవడం జరిగింది. ప్రకాష్ రాజ్ లాంటి మేటి నటుడి పాత్రను ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడో చూడాలి. ఇక కెజిఎఫ్ 2 లో టాలీవుడ్ నుండి రావు రమేష్ కూడా నటించడం విశేషం. 


పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న కెజిఎఫ్ 2, జులై 16న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. కెజిఎఫ్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. హీరో యష్ పుట్టినరోజు కానుకగా విడుదలైన కెజిఎఫ్ 2 టీజర్ వ్యూస్ లో వరల్డ్ రికార్డు రాబట్టింది. వందల మిలియన్స్ వ్యూస్ రాబట్టి సత్తా చాటింది.