ప్రస్తుతం సినిమాలో ఇంటిమేట్‌ సీన్స్ కామన్‌ అయిపోయాయి. కానీ గతంలో లిప్‌ లాక్‌ సీన్‌ అంటేనే వామ్మో అనే వారు. అయితే అలాంటి సమయంలో కూడా గ్లామరస్‌ రోల్స్‌లో దుమ్ము లేపిన నటి బిపాస బసు. బాలీవుడ్ తో పాటు పలు రీజినల్ సినిమాల్లోనూ నటించిన ఈ బ్యూటీ హాట్ హాట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే తెర మీద ఏ స్థాయిలో రెచ్చిపోయినా ఓ హీరోతో లిప్‌ లాక్‌ విషయంలో మాత్రం బిపాస తెగ ఇబ్బంది పడిపోయిందట.

బిపాసను అంతగా ఇబ్బంది పెట్టిన హీరో మరెవరో కాదు బహు భాషా నటుడు, మోస్ట్ టాలెంటెడ్ స్టార్ మాధవన్. మ్యాడీ, బిపాసాలు జోడీ బ్రేకర్స్ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఇంటిమేట్‌ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ విషయం దర్శకుడు చెప్పగానే బిపాసకు భయం వేసిందట. ఇక లిప్ లాక్ సీన్ అనే సరికి తనకు గుండె ఆగినంత పనైందని చెప్పింది బిపాస.

మాధవన్‌ తనకు క్లోజ్‌ ఫ్రెండ్ కావటమే అందుకు కారణమని చెప్పింది బిపాస. అంత పెద్ద క్రూ మధ్యలో లిప్‌ లాక్‌, రొమాంటిక్ సీన్స్‌లో నటించటం చాలా ఇబ్బంది ఉంటుందన్న బిపాస, అది కూడా క్లోజ్ వ్యక్తులతో చేయాలంటే మరింత ఇబ్బందిగా ఉంటుందని వెల్లడించింది. అయితే మాధవన్‌తో లిప్‌ లాక్ సీన్ పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, తన ఇబ్బంది చూసి సెట్‌ వారు అంతా నవ్వుకున్నారని చెప్పింది..