ప్రస్తుతం సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. రాజకీయ నాయకులు, క్రీడాకారులతో పాటు సినీ ప్రముఖుల జీవితాలను కూడా సినిమాలుగా రూపొందిస్తున్నారు. వివాదం, సినిమాటిక్‌ ట్విస్ట్‌లు టర్న్‌లు ఉన్న వారి కథలను వెండితెర మీద చూపించేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రస్టింగ్ బయోపిక్‌ తెర మీదకు వచ్చింది.

నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్‌ పరిచయం అయిన అందాల భామ ఆర్తి అగర్వాల్ తొలి సినిమాలోనే తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, తరువాత స్టార్ హీరోలందరితోనూ వరుస సినిమాలు చేసింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, మహేష్, ఎన్టీఆర్‌, ప్రభాస్ లాంటి వారందరితోనూ సూపర్‌ హిట్ సినిమాల్లో నటించింది. అయితే కెరీర్‌ పరంగా భారీ స్థాయిలో ఎదిగిన ఈ బ్యూటీ అర్ధాంతరంగా వెనకపడిపోయింది.

లుక్‌ పరంగా సమస్యలు రావటంతో ఆర్తి కెరీర్‌ కష్టాల్లో పడింది. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు రావటం ఆమె కెరీర్‌ మరింత ఇబ్బందుల పాలు చేశాయి. ఆ సమయంలో బ‌రువు త‌గ్గ‌డానికి చేయించుకున్న లైపో సెక్షన్‌ ఆప‌రేష‌న్ విక‌టించ‌డంతో చిన్న వయసులోనే క‌న్నుమూసింది ఆర్తి అగ‌ర్వాల్. ఇప్పుడు జీవిత నేప‌థ్యంలో సినిమా తెరకెక్కించేందుకు చ‌ర్చలు జరుగుతున్నట్టుగా ఇండ‌స్ట్రీ టాక్. అయితే ఈ సినిమాలో ఆర్తి పాత్రలో నటించబోయే హీరోయిన్‌ ఎవరన్న అంశం మీదే ప్రధానంగా చర్చ జరుగుతోంది.