Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీ రిలీజ్ కు సిద్ధంగా ‘బింబిసారా’.. ఎప్పుడు రాబోతోంది.. స్ట్రీమింగ్ ఎక్కడ?

‘బింబిసార’(Bimbisara)తో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తవడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు తాజాగా అప్డేట్ అందింది.

Bimbisara Movie ready for OTT release,  When is it coming, Where is the streaming?
Author
First Published Sep 27, 2022, 7:27 PM IST

వరుస ఫ్లాప్స్ తో కేరీర్ ను నెట్టుకొస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఫాంటాసీ యాక్షన్ ఫిల్మ్ ‘బింబిసార’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కళ్యాణ్ రామ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడంటూ నందమూరి అభిమానులు, ఆడియెన్స్ సంతోషం వ్యక్తం చేశారు. తొలిసారిగా చక్రవర్తి పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దర్శకుడు మల్లిడి వశిష్ఠ కూడా ప్రతి ఫ్రేమ్ ను ఆసక్తికరంగా చిత్రీకరించడంతో సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. 

ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. తాజాగా ఓటీటీలోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ‘బింబిసారా’ ఓటీటీ రిలీజ్ కు ముహూర్తంగా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇప్పటికే డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జీ5 (Zee5)లో అక్టోబర్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీంతో నందమూరి అభిమానులు, ఓటీటీ ఆడియెన్స్ ఖుషీ అవుతున్నారు. మరోసారి బింబిసారను Ottలో తిలకించేందుకు సిద్ధంగా ఉన్నారు. అప్పటికీ దసరా పండుగ పూర్తవుతుండటంతో బింబిసారుడు ఓటీటీలోనూ రికార్డు చేయబోతున్నట్టు  తెలుస్తోంది. 

500 ఏండ్ల నాటి త్రిగర్థల సామ్రాజ్యాధిపతి, మహాచక్రవర్తి బింబిసారుడి పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన విషయం తెలిసిందే. చిత్రాన్ని మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేయగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత నందమూరి కే హరిక్రిష్ణ నిర్మించారు. రూ.40 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా రూ.65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ‘బింబిసార’ను నాలుగు పార్టులుగా రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగం విజయవంతం అవడంతో రెండో భాగాన్ని మరింత గ్రాండ్ గా నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే ‘బింబిసార 2’ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ‘బింబిసార 2’లోనైనా.. ‘బింబిసారా 3’లోనైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను దింపుతానని ఇప్పటికే కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేయడంతో వచ్చే సీక్వెల్స్ పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి.

Follow Us:
Download App:
  • android
  • ios