బిగ్ బాస్ హౌస్ లో బికినీలు..?

bikinis in telugu big boss house 2
Highlights

గతేడాది ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ షో మంచి రేటింగ్స్ తో విజయవంతమైంది. 

గతేడాది ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ షో మంచి రేటింగ్స్ తో విజయవంతమైంది. ఇప్పుడు సీజన్ 2 మొదలుకాబోతుంది. యంగ్ హీరో నాని ఈ షోని హోస్ట్ చేయనున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన పోస్టర్ తో పాటు ప్రోమో కూడా విడుదల చేశారు. ఇందులో నాని 'బాబాయ్ ఇంకొంచెం మసాలా' అని చెప్పడం ఆసక్తికి కలిగిస్తోంది. ఏదైనా జరగచ్చు అంటూ నాని చివరగా పలికిన మాటలను బట్టి ఈ షోని మరింత హాట్ గా నడిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

తెలుగు బిగ్ బాస్ తో పోలిస్తే హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో కావలసినంత కాంట్రవర్సీ మసాలా కనిపిస్తుంది. బిగ్ బాస్ హిందీ షోలో కంటెస్టంట్స్ బికినీలు వేసుకొని షోకి మరింత గ్లామర్ ను తీసుకొచ్చారు. కొందరు పెళ్లైన వ్యక్తులు కూడా హౌస్ లో కొందరితో ప్రేమ వ్యవహారాలు నడిపించడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా బిగ్ బాస్ మరాఠీ షోలో ఒక పెళ్లైన పోటీదారుడు తన కో స్టార్ ను ముద్దు పెట్టుకున్నాడు.

ఇక తమిళ బిగ్ బాస్ హౌస్ లో ఒవియా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీటితో పోలిస్తే తెలుగు షోని బాగా స్మూత్ గా ఎలాంటి వివాదాలు లేకుండా నడిపించారు. కానీ ఈసారి నాని మసాలా అని ఇండికేట్ చేస్తుండడంతో ఈ సీజన్ లో బికినీలు, ముద్దులు అంటూ ఏమైనా హడావిడి చేస్తారేమో చూడాలి!
 

loader