'మహానటి'లో బిగ్గెస్ట్ బ్లండర్ ఇదే!

biggest blunder in mahanati movie
Highlights

బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతుంది 'మహానటి' చిత్రం. దాదాపు మూడేళ్ళుగా 

బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతుంది 'మహానటి' చిత్రం. దాదాపు మూడేళ్ళుగా ఈ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు సావిత్రి బయోపిక్ ను ప్రతిఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే లోతుగా గమనిస్తే గనుక ఈ సినిమాలో ఓ పెద్ద బ్లండర్ చేశాడు దర్శకుడు. అదేంటంటే.. సినిమాలో సావిత్రి(కీర్తి సురేష్) 'గోరింటాకు' సినిమా షూటింగ్ లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ఎస్వీఆర్(మోహన్ బాబు) పిలిచి ఆమెకు తన ఇంటి భోజనం వడ్డిస్తారు.
నిజానికి గోరింటాకు సినిమా విడుదలైంది 1979లో..  కానీ ఎస్విఆర్ 1974 లోనే మరణించారు. సావిత్రికి పిలిచి మరీ భోజనం పెట్టింది గుమ్మడి.. ఎస్వీఆర్ కాదు. ఈ విషయంపై వివరణ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్.. 
''సావిత్రికి భోజనం పెట్టింది గుమ్మడి గారు. కానీ మరో క్యారెక్టర్ ను సినిమాకు యాడ్ చేసే సమయం లేక సినిమాటిక్ లిబర్టీతో ఎస్వీఆర్ తో ఆ సీన్ చేయించాను. అది తప్పే అయినా ప్రేక్షకులను ఆ చిన్న తప్పును క్షమించేసి సినిమాను ఆదరిస్తున్నారు'' అని అన్నారు. నిజానికి సినిమాకు ఈ సీన్ హైలైట్ గా నిలిచింది. ఆ సమయంలో ఎస్వీఆర్ పాత్ర చెప్పే డైలాగ్ (అన్నం పెట్టేవాడి ఉంగరాల్లను కూడా కొట్టేయాలని చూసే సమాజమిది) ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. 

loader