అభిజిత్‌ మొత్తంగా బిగ్‌బాస్‌ నుంచి ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

బిగ్‌బాస్‌ 4 ఫైనల్‌లో సోహైల్‌ 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని మధ్యలోనే డ్రాప్‌ కావడం, ఆయనకు నాగార్జున మరో పది లక్షలు ఇవ్వడంతో సోహైల్‌ ముందు అభిజిత్‌ తేలిపోయాడు, సోహైలే బాగా పొందాడనే చర్చ జరిగింది. ఈ విషయంలో అభిజిత్‌కి అన్యాయమే జరిగిందన్నారు. 

biggboss4 winner abhijit shocking remunaration in house  arj

అభిజిత్‌ బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌గా నిలిచారు. 105 రోజులపాటు జరిగిన బిగ్‌బాస్‌ షో ఆదివారంతో ముగిసింది. అంతా ఊహించినట్టే అభిజిత్‌ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్‌లో సోహైల్‌ 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని మధ్యలోనే డ్రాప్‌ కావడం, ఆయనకు నాగార్జున మరో పది లక్షలు ఇవ్వడంతో సోహైల్‌ ముందు అభిజిత్‌ తేలిపోయాడు, సోహైలే బాగా పొందాడనే చర్చ జరిగింది. ఈ విషయంలో అభిజిత్‌కి అన్యాయమే జరిగిందన్నారు. 

కానీ తాజా సమాచారం మేరకు అసలు అందరికంటే అత్యధికంగా పొందింది అభిజితే అనే ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్‌ ట్రోఫీ సాధించడంతోపాటు 25లక్షల ప్రైజ్‌మనీ పొందాడు అభిజిత్‌. కానీ ఆయన 105 రోజులపాటు హౌజ్‌లో ఉన్నందుకు భారీగానే తీసుకున్నాడట. వారానికి నాలుగు లక్షలు తీసుకునే వాడని, 15 వారాలకు అరవై లక్షలు రెమ్యూనరేషన్‌ రూపంలో పొందాడట. దీంతోపాటు ప్రైజ్‌మనీ 25 లక్షలు మొత్తంగా 85లక్షలు పొందాడు అభిజిత్‌. అలాగే ఓ బైక్‌ కూడా ఆయన సొంతమైంది. ఇంకా
ఇతరతరా కలిసి దాదాపు కోటి వరకు అభిజిత్‌ బిగ్‌బాస్‌ ద్వారా పొందినట్టు సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి దీనిలో నిజమెంతా అనేది తెలియాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios