బిగ్‌బాస్‌4 పదకొండో రోజు షో కాస్త రంజుగా సాగింది. అదిరే అవినాష్‌ `జోకర్‌` గెటప్‌లో కొత్తగా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వచ్చారు. దీంతో షోకి కొత్త ఊపు వచ్చింది. పదకొండో రోజు ఆద్యంతం సందడిగా, అనేక డ్రామాలు, ట్విస్ట్ లతో సాగి ఆకట్టుకుంది. 

ప్రారంభంలో రాత్రి ఎప్పటిలాగే అభిజిత్‌, సుజాత, దేవి నాగవల్లి, దేత్తడి హారిక కలిసి గుసగుసలాడారు. సుజాత్‌ లవ్‌ ఎఫైర్‌ గురించి  చర్చించారు. ఇందులో ఎవరినో ఒకరిని కనెక్ట్ చేసుకోవాలని, అందుకు నోయల్‌ మాత్రమే ఆప్షన్‌ అని మిగతా వారు సూచించారు. ఆ తర్వాత ఆమె నోయల్‌ వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పగా, తాను క్లియర్‌గా ఉంటానని, సిస్టర్‌లా భావిస్తానని తెలిపాడు. ఎవరేమన్నా పట్టించుకోకు అని చెప్పాడు. 

ఇక ఉదయం ఎనిమిది గంటలకు అందరు రెగ్యులర్‌గా పార్క్ లో డాన్స్ వేస్తుంటారు. కానీ ఇంకా ఎవరూ లేవలేదు. హౌజ్‌లో ఓ వాయిస్‌ వారిని లేపారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఊహించని విధంగా హౌజ్‌లోకి `జబర్దస్త్` అవినాష్‌ వచ్చాడు. 

జోకర్‌ గెటప్‌లో అవినాష్‌ ఎంట్రీ ఆకట్టుకుంది. అంతేకాదు తాను ఈ స్థాయికి వచ్చిన వైనాన్ని ప్రోమోలో వివరించిన తీరు హృదయాన్ని కదిలించింది. ఆద్యంతం ఆకట్టుకుంది. వచ్చి రాగానే తనదైన స్టయిల్‌లో కామెడీతో, సందడితో అలరించాడు. కంటెస్టెంట్స్ లో ఊపుని తీసుకొచ్చాడు. అంతేకాదు వచ్చీ రాగానే మోనాల్‌కి పోప్‌ వేయడం పాప్‌ వేయడం ప్రారంభించాడు. 

ఆ తర్వాత కిచెన్‌లో అఖిల్‌కి, అభిజిత్‌కి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. అఖిల్‌, మోనాల్‌ కలిసి అభిజిత్‌ కావాలని చేస్తున్నాడని, కిచెన్‌కి రానని మోనల్‌తో చెప్పాడు. 

పదకొండో రోజు బెడ్‌లు మార్చే ఎపిసోడ్‌ ఆద్యంతం రక్తికట్టించింది. బాగా ఫన్‌గా సాగింది. ఇందులో అమ్మా రాజశేఖర్‌, నోయల్‌ కలిసి కళ్యాణి, దేవి నాగవల్లి బెడ్‌లోని దుస్తుల రాక్‌లు మార్చేశారు. అది వారికి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నారు. 

కళ్యాణి వచ్చాక వెనకాల నోయల్‌ దాక్కుని బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్‌ కాలేదు. సుజాత్‌ వచ్చాక నోయల్‌ బెదిరించడంతో సుజాత్‌ భయపడి కన్నీళ్ళు పెట్టుకుంది. 

అయితే బెడ్‌లోని రాక్‌లో ఎవరి డ్రెస్సులు ఎక్కడున్నాయో కరెక్ట్ గా చెప్పాలని అవినాష్‌తో ఓ గేమ్‌ ఆడుకున్నారు. కరెక్ట్ గా చెబితే సర్‌ప్రైజ్‌ ఉంటుందని, లేదంటే తాము ఏం చెబితే అది చేయాలంటారు. అవినాష్‌ రాంగ్‌ రాక్‌ తీయడంతో అందరు కలిసి అవినాష్‌కి లేడీ గెటప్‌ వేసి గంగవ్వతో క్యాట్‌వాక్‌ చేయించారు. ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. 

ఆ తర్వాత అభిజిత్‌, సుజాత్‌ మధ్య రహస్య చర్చలు జరిగాయి. ప్రారంభంలో సుజాత విషయంలో లవ్‌కి సంబంధించి తనకున్న అభిప్రాయంపై అభిజిత్‌ `ఏ ఛీ ఛీ.. నాకు చెల్లిలాంటిది` అనడాన్ని తాను ఫీల్‌ అయ్యానని సుజాత్‌ తెలిపింది. తన ఉద్దేశం అది కాదని ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు అభిజిత్‌. కాసేపు వీరి మధ్య హై డ్రామా సాగింది. సుజాత్‌ కన్నీళ్ళు పెట్టుకుంది. ఈ ఎపిసోడ్‌ చూస్తుంటే మొత్తంగా మరో కొత్త లవ్‌ ట్రాక్‌కి తెరలేపారని అర్థమవుతుంది. 

ఇక నెక్ట్స్ బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు సుజాత `బీబీటీవీ`లో కామెడీ షో చేయాలని సభ్యులకు చెప్పింది. రెండు గ్రూపులుగా విడగొట్టింది. దీనికి సంబంధించిన రిహార్సల్‌ జరుగుతున్న క్రమంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 

గంగవ్వ అనారోగ్యానికి గురయ్యారు. బాగా నీరసించిపోయారు.  గంగవ్వ అనారోగ్యానికి గురయ్యారు. తాను వెళ్ళిపోతానని వేడుకుంటున్నారు. తనకు ఈ వాతావరణం పడటం లేదని తెలిపింది. దీంతో ఆమెని బిగ్‌బాస్‌ పిలిచాడు. ఆమెతో మాట్లాడి, కంగారు పడవద్దని, త్వరగానే కోలుకుంటారని, గంగవ్వ గట్టివారని చెప్పి ధైర్యాన్ని నూరిపోయాడు. తమ వైద్యులు అన్ని రకాలుగా చూసుకుంటారని బిగ్‌బాస్‌ తెలిపారు. చివరగా ఆమెని మెడికల్‌ రూమ్‌కి పిలిపించారు.

మరి గంగవ్వకి ఏమైంది. ఆమెకి కరో్నా టెస్ట్ చేశారా? దానిఫలితమేంటి? అనేది సస్పెన్స్ నెలకొంది. మరోవైపు కామెడీ షో కూడా సస్పెన్స్ నెలకొంది. ఈ రెండు ఉత్కంఠభరిత అంశాలు ఇప్పుడు సస్పెన్స్ లో ఉన్నాయి. రేపు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.