బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ చివరికి చేరుకుంది. ప్రస్తుతం 14వ వారం ప్రారంభమైంది. నామినేషన్‌కి చివరి వారమిదే. ఈ వారం కూడా అఖిల్‌ తప్ప మిగిలిన వారంతా నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. అఖిల్‌ ఇప్పటికే గ్రాండ్‌ఫినాలేకు చేరుకున్నారు. తాజాగా పంచుకున్న బిగ్‌బాస్‌ ప్రోమోల్లో సోహైల్‌, హారిక రాజు, రాణిలుగా కనిపిస్తున్నారు. వీరిద్దరు మిగిలిన సభ్యులను శాషిస్తున్నట్టుగా ఉంది. మొదటి ప్రోమోలో సోహైల్‌ కిరీటాన్ని దక్కించుకుని రాజుగా మారాడు. ఆయన ఆజ్ఞ ప్రకారమే మిగతా ఇంటి సభ్యులు నడుచుకోవాల్సి ఉంటుంది. 

అయితే రాజుగా మారిన సోహైల్‌.. అరియానాకి చుక్కలు చూపించాడు. ఆమె మోయలేనన్ని పనులు అప్పగించాడు. దీంతో ఇది గమనించిన అభిజిత్‌.. మహారాజా ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం కదా` అంటే పంచ్‌ వేశాడు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన రాజుగా ఆరియానా చేసిన తప్పులకు శిక్షలు విధిస్తున్నాడు. రాక్షసుల టాస్క్ లో అరియానా ఎంత రాక్షసంగా ప్రవర్తించిందని మండిపడ్డాడు. ఆమెపై నీళ్లు పోసి, గుడ్లు పగులకొడుతూ చిత్ర హింసలు పెట్టాడు సోహైల్‌. 

ఇక అరియానా స్పందించి నేను కూడా రాణి అయ్యే అవకాశం ఉందని చెప్పడంతో.. అమ్మో నాకు ఫ్యూచర్‌ కనిపిస్తోందని సోహైల్‌ బెంబెలెత్తిపోయాడు. ఇది చాలా ఫన్నీవేలో గేమ్‌ సాగుతున్నట్టు అర్థమవుతుంది. మరో ప్రోమోలో హారిక రాణి అయ్యింది. సోహైల్‌ బట్టలు నీళ్లల్లో పడేసింది. దీంతో సోహైల్‌ ఫైర్‌ అయ్యాడు. ఏం చేస్తాడో చూస్తా అంటూ చైర్‌ లాగేశాడు. మరోవైపు సోహైల్‌కి, అఖిల్‌ కి మధ్య వివాదం జరిగింది. ఇందులో సోహైల్‌ వైపు అభిజిత్‌ ఉండటం ఆసక్తిగా మారింది.