బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ దసరా స్పెషల్‌ చాలా ప్రత్యేకంగా ఉంది. నాగార్జున తన `వైల్డ్‌ డాగ్‌` సినిమా కోసం హిమాలయాల్లోకి వెళ్ళారు. దీంతో సమంత హోస్ట్ గా వచ్చారు. అనేక కొత్త గేమ్స్ తో సందడి చేశారు.  

సమంతని ఇంటిసభ్యులకు పరిచయం చేశారు. తాను లేనప్పుడు ఇంటి బాధ్యతలు ఇంటి కోడలకు అప్పగిస్తామని, అలా బిగ్‌బాస్‌ బాధ్యతులు సమంతకి అప్పగించామని చెప్పారు. సమంత ఇంటి సభ్యులను పరిచయం చేసుకున్నారు. ఒక్కొక్కరి గురించి చెప్పారు. అందరిపై సెటైర్లు వేశారు. ముఖ్యంగా అరియానా తనలా ఉందని చెప్పారు. 

అరియానాని చూస్తుంటే తననే చూసినట్టు ఉందని చెప్పింది. కొంటె పనులు, అల్లరి తనలాగే ఉన్నాయన్నారు. ఇద్దరి మధ్య దగ్గరి క్వాలిటీస్‌ ఉన్నాయని తెలిపింది. దివి గురించి చెబుతూ, అందంగా ఉన్నావని, గేమ్‌పై పెట్టాలన్నారు. హారిక గురించి చెబుతూ, ఈ వారం సరిగా ఆడలేదని చెప్పింది. లాస్యది కన్నింగ్‌ స్మైల్‌ కాదని, విన్నింగ్‌ స్మైల్‌లా ఉందని చెప్పింది. సేఫ్‌గా కాదు బాగా ఆడాలన్నారు. మోనాల్‌ గురించి చెబుతూ, బిగ్‌బాస్‌ చాలా నేర్పిస్తుందని, ప్రేమించడం నేర్పిస్తుందన్నారు. 

బాయ్స్ ని మాత్రం ఓ రేంజ్‌లో ఆడుకుంది సమంత. అబ్బాయిల్లో తమలోని స్ట్రెన్త్, వీక్‌నెస్‌ చెప్పాలన్నారు. సోహైల్‌ హ్యాపీగా ఉండటం, చర్చల్లో తాను ముందుంటానని, జరిగింది మర్చిపోతానని తెలిపాడు. వీక్‌నెస్‌ నరాలు ఉప్పొగ్గుతాయని, నాగార్జునగారి వల్ల ఇప్పుడు తగ్గాయన్నారు. అభిజిత్‌ ఈ వారం చాలా స్పెషల్‌ అని, ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మైల్‌ సమంతదని సమంతకే పులిహోర కలిపాడు. ప్లస్‌ డిసిప్లెయిన్‌, నెగటివ్‌ కోపమన్నారు. 

నోయల్‌ చెబుతూ, పాజిటివ్‌గా ఉంటానని, అందరు బాగుండాలని కోరుకుంటానని, ఫ్యామిలీని మిస్‌ కావడం మైనస్‌ అని చెప్పింది. ఈ సందర్భంగా సమంత చెబుతూ మీరు గురువు కావాలని సెటైర్‌ వేశారు. ఇక అవినాష్‌ వంతు వచ్చింది. ఆయన సోఫాపై రాయడంపై సెటైర్లు వేశారు. తన ప్లస్‌ ఆడియెన్స్ అని, వీక్‌నెస్‌ ఫ్యామిలీ, కోపం అని తెలిపింది.