యాంకర్ `జోర్దార్‌` సుజాత బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌గా ఎంపికయ్యారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంటోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా, ఆమె `అతి` పనులు ఇప్పుడు ఇతర కంటెస్టెంట్లనే కాదు, ఆడియెన్స్ ని విసుగు తెప్పిస్తుందట. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఓవరాల్‌గా చూస్తే అంత రంజుగా సాగడం లేదనే కామెంట్‌ సోషల్‌ మీడియా నుంచి, టెలివిజన్‌ ప్రియుల నుంచి వినిపిస్తుంది. చాలా సార్లు షోనే బోర్‌ కొడుతుందంటే, మధ్యలో కంటెస్టెంట్‌ సుజాత మరింత చిరాకు తెప్పిస్తుందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బిగ్‌బాస్‌ 4లో ఓ ప్రముఖ టీవీ న్యూస్‌ ఛానెల్‌నుంచి యాంకర్ `జోర్దార్‌` సుజాత కంటెస్టెంట్‌గా ఎంపికయ్యారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంటోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా, ఆమె `అతి` పనులు ఇప్పుడు ఇతర కంటెస్టెంట్లనే కాదు, ఆడియెన్స్ ని విసుగు తెప్పిస్తుందట. ముఖ్యంగా ఆమె నవ్వు విషయంలో అనేక విమర్శలు, కామెంట్స్ వస్తున్నాయి. 

ఫేక్‌ నవ్వు అంటూ దుమ్మెత్తిపోతున్నారు. చీటికి మాటికి నవ్వడంతో ఎందుకునవ్వుతుందో అర్థం కాదని నాగార్జునే అన్నాడు. అయితే వచ్చిన మొదట్లో నాగ్‌ని బిట్టూ అని పిలిచి ఆకట్టుకున్నా, అదే పనిగా పిలవడం మాత్రం చాలా ఓవర్‌ యాక్షన్‌గా ఉందంటున్నారు. ఒకటి రెండు సార్లు అంటే ఏమోగానీ, ఓ పెద్ద స్టార్‌ని పట్టుకుని ప్రతి సారి బిట్టూ అని పిలవడం నాగ్‌కి కూడా ఇబ్బందికరంగా మారింది. పైకి చెప్పకపోయినా లోలోపల ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారని టాక్‌. కనీసం గౌరవం ఇవ్వాలని నాగ్‌ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ముఖ్యంగా నవ్వు విషయంలోనే బాగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు హౌజ్‌లో అప్పుడే నవ్వడం, అప్పుడే ఏడవడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్‌ చేయడం అంతుచిక్కడం లేదు. ఫేక్‌ నవ్వు ఆపమని, చూడలేక చచ్చిపోతున్నామని కామెంట్‌ చేస్తున్నారు. మరోవైపు మానసికంగా తానేమైనా ఒత్తిడికి గురవుతుందా? అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సుజాతపై మీమ్స్ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతుండటం విశేషం. సుజాత ఎప్పుడెప్పుడు ఎలిమినేట్‌ అవుతుందని కోరుకుంటున్నామని అంటున్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…