బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో కంటెస్టెంట్‌గా సందడి చేసింది దివి వధ్య. సెటిల్డ్ గా గేమ్‌ ఆడి మధ్యలోనే ఎలిమినేట్‌ అయ్యింది. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం అద్భుతమైన డాన్స్ తో, వంపుసొంపులతో మెస్మరైజ్‌ చేసిందీ సొట్టబుగ్గల సుందరి. షోలో భాగంగా నిర్వహించే గేమ్‌ల్లో తన వంతు బెస్ట్ ఇచ్చింది. ఆటపాటలతో అలరించింది. తన అందంతోనూ కనువిందు చేసింది. 

ఇదే ఇప్పుడు చిరంజీవిని ఆకర్షించింది. అంతేకాదు ఏకంగా అవకాశాన్నే కొట్టేసింది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలెలో అతిథిగా విచ్చేసిన చిరంజీవి వరుసగా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ, వారికి సంబంధించిన హైలైట్‌ అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. దివి వంతు రాగానే సిగ్గుపడటం స్టార్ట్ చేశారు. ఇది అందరిని నవ్వులు పూయించింది. ఆమె సినిమా అవకాశాల కోసం చూస్తుందని, డాన్స్ బాగా చేస్తుందని చెప్పారు. ఆకాశానికి ఎత్తడమే కాదు, తన సినిమాలో ఓ అవకాశం కూడా ఇస్తా అన్నాడు. 

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `వేదాలం` చిత్రాన్ని తెలుగులో చిరంజీవి రీమేక్‌ చేస్తున్నారు. దీనికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దివికి ఛాన్స్ ఇస్తానని తెలిపారు. తనతో కలిసి ఓ సాంగ్‌లో డాన్స్ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చాడు. మరి నిజంగానే చిరు దివి ఆ ఛాన్స్ ఇస్తాడా? కేవలం వేదికపై ఏదో ఒకటి చెప్పాలి కదా? అని చెప్పాడా? అన్నది `వేదాలం` షూటింగ్‌ స్టార్‌ అయితేగానీ తెలియదు. 

ప్రస్తుతం చిరంజీవి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. దీని తర్వాత `లూసీఫర్‌` రీమేక్‌ ఉండనున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీనికి తమిళ దర్శకుడు మోహన్‌రాజా డైరెక్షన్‌ చేస్తున్నారు. దీన్ని ఇటీవలే ప్రకటించారు. ఆ తర్వాత `వేదాలం` రీమేక్‌ ఉండే ఛాన్స్‌ ఉంది. సో అప్పటి వరకు వెయిటింగ్‌ తప్పదు. అయితే ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ షోస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లకి షో తర్వాత వరుసగా అవకాశాలు పొందింది ఎవరూ లేరు. దీంతో దివి విషయంలో ఆ సందేహాలు నెలకొన్నాయి.