దసరా స్పెషల్‌గా బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఏడోవారంలో ఎలిమినేషన్‌ ఉండదని ఇంటి సభ్యులు, నామినేట్‌ అయిన మెంబర్‌ భావించారు. కానీ వారికి షాక్‌ ఇచ్చింది హోస్ట్ సమంత. ఆమె నాగార్జున స్థానంలో వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ వారం ఎలిమినేషన్‌ ఉందని తెలిసింది. ఇప్పటి వరకు అరియానా, మోనాల్‌, అభిజిత్‌ సేవ్‌ అయినట్టు తేలింది. అఖిల్‌ మోనాల్‌ని సేవ్‌ చేశాడు. అంతకు ముందు బిగ్‌బాస్‌ సింబర్‌ ఐస్‌ సగం మ్యాచ్‌ అయిన వాళ్ళు సేవ్‌ అని చెప్పగా, అరియానా సేవ్‌ అయ్యింది. మిగిలిన అభిజిత్‌, అవినాష్‌, నోయల్‌, దివి మిగిలారు. 

వీరిలో దివి ఈ వారం ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సమంత అందంగా ఉన్నావ్‌ కానీ గేమ్‌ బాగా ఆడాలని చెప్పింది. ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కాదని చెప్పిన విషయం తెలిసిందే. ముందే దివిని హెచ్చరించింది. హెచ్చరించినట్టే ఆ ఫనిష్‌మెంట్‌ దివికి పడినట్టు తెలుస్తుంది. ఉత్కంఠభరితమైన ఆటలో దివి ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తుంది.