బిగ్‌బాస్‌4 రెండో వారంలో ఎలిమినేషన్‌లో ఎవరో తెలిసిపోయింది. అందరు ఊహించిన నట్టే కరాటే కళ్యాణి ఎలిమినేట్‌ అయ్యారు. ఆమె ఎలిమినేట్‌ అయినట్టు బిగ్‌బాస్‌ నాగార్జున చెప్పారు. 

బిగ్‌బాస్‌4 రెండో వారంలో తొమ్మిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. సెల్ఫ్‌గా ఎవరికి వారు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. అయితే సెల్ఫ్‌ ఎలిమినేషన్‌పై నాగ్‌ ఫైర్‌ అయ్యారు. ఆడటానికి వచ్చారా? వెళ్ళిపోవడానికి వచ్చారా? అంటూ మండిపడ్డారు. సభ్యులందరికి క్లాస్‌పీకాడు. 

ఇక హీరో, జీరో ఎపిసోడ్‌ తర్వాత ఎలిమినేషన్‌ గురించి తేల్చి చెప్పేశాడు బిగ్‌బాస్‌. రెండో వారంలో రెండు ఎలిమినేషన్లు ఉంటాయని, శనివారం ఒకరు, ఆదివారం మరొకరు ఎలిమినేట్‌ అవుతారని చెప్పిన నాగ్‌ శనివారం మొదటి ఎలిమినేట్‌ పర్సన్‌ని నస పెట్టకుండా డైరెక్ట్‌గా కరాటే కళ్యాణి పేరు చెప్పేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 

ఎలిమినేషన్‌ చెప్పేసి నాగ్‌ వెళ్ళిపోయాడు. ఇక కరాటే కళ్యాణిని అందరు ఓదార్చారు. అందుకు తాను స్పందిస్తూ, ఎలిమినేట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, తన బాబుని చూసుకోవాలని, బయట చాలా పనులున్నాయని తెలిపింది. అంతేకాదు ఇందులో ఉండలేని వెన్నుపోట్లు పొడుస్తున్నారని, అవన్నీ తట్టుకోలేకపోతున్నానని తెలిపింది. సభ్యులందరు ఆమెని దగ్గరుండి హౌజ్‌ నుంచి బయటకు పంపించారు.