`బిగ్‌బాస్‌4` షోలో గంగవ్వ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. `బిగ్‌బాస్‌`షోలోనే ఓ వృద్ధురాలిని కంటెస్టెంట్‌గా ఎంపిక చేయడం విశేషం. తెలంగాణ యాసతో యూట్యూబ్‌ స్టార్‌గా నిలిచిన గంగవ్వ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బుధవారం ఎపిసోడ్‌లో లిప్‌కిస్సులు, గొలలు..డంబెల్స్ ఎత్తి `వాహ్‌..` అనిపించింది. ఈ సీజన్‌లో దూసుకుపోతుంది. 

అయితే ఆమె మొదటి వారం ఎలిమినేషన్‌ ప్రక్రియకు ఎంపికైంది. దీనిపై తాజాగా `బిగ్‌బాస్‌ 2` విన్నర్‌ కౌశల్‌ మండా `బిగ్‌బాస్‌4`పై స్పందించారు. గంగవ్వ పది వారాలకుపైనే ఉంటుందన్నారు. గీతా మాధురిలాగానే గంగవ్వ ఉండే ఛాన్స్ ఉందన్నారు.

ఇంకా చెబుతూ, ఈ సీజన్‌లో ఎంపికైన కంటెస్టెంట్స్ పై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలోనూ కంటెస్టెంట్స్ పై సెటైర్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌశల్‌ కూడా పెదవి విరచడం విశేషం.  కరోనా కారణంగా సెలబ్రిటీలు ఆసక్తి చూపకపోవడం వల్లే అందుబాటులో ఉన్న వారిని ఎంపిక చేసి ఉంటారని తెలిపారు. మొత్తంగా `బిగ్‌బాస్‌` ప్రమాణాలకు తగ్గట్టుగా సభ్యులు లేరని తెలిపారు. 

గంగవ్వ ఎంపికపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్‌ వయసులో `బిగ్‌బాస్‌`లోకి రావడం స్ఫూర్తినిచ్చిందని, గంగవ్వ ఎంపిక గ్రామీణ వీక్షకుల సంఖ్యని పెంచడమే కాకుండా షోకు ఓటు బ్యాంక్‌ తెచ్చిపెడుతుందన్నారు. అతి సామాన్య కుటుంబం, గ్రామీణ నేపథ్యం ఉన్న గంగవ్వ ధైర్యాన్ని చూసి ముచ్చటేసిందన్నారు. ఏజ్‌కి అతీతంగా  ఆమె కనబరుస్తున్నె ఎనర్జీకి ఫిదా అయ్యానని తెలిపారు. ఎంటర్‌టైన్ ఇండస్ట్రీ రూల్స్ ని  బ్రేక్ చేసి అందరికీ ఓ స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. 

ఇంకా చెబుతూ, గంగవ్వకు ఫిజికల్‌ టెస్ట్ లు, పెద్ద సమస్య కాదు, అవి ప్రతిభని అణచలేవని, `బిగ్‌బాస్‌2` సీజన్‌ టైమ్‌లో గీతా మాధురీ ఎలాంటి టాస్కులు చేయకుండానే ఫైనల్‌కి వచ్చిందని, ఇప్పుడు అలాగే గంగవ్వ వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ఆమె పది వారాలకుపైగా హౌజ్‌లో ఉంటుందని, సీజన్ 4‌లోని సెలబ్రిటీల అందరిలోనూ  అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న కంటెస్టెంట్‌గా గంగవ్వ నిలిచారని తెలిపారు. మరి గంగవ్వ చివరి వరకు ఉంటుందా? లేదా అన్నది ఈ వారంలో తేలిపోనుంది.