Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: గ్రాండ్‌గా బిగ్‌ బాస్‌ షురూ.. ఓ వైపు కన్నీళ్లు, మరో వైపు స్ఫూర్తినింపే జీవితాలు..

ఎంటర్‌ టైన్‌మెంట్‌ అడ్డా బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 అంటూ నాగార్జున హోస్ట్ గా `బిగ్‌ బాస్‌ తెలుగు 6` ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది.

biggboss telugu 6 grand launch with biggest entertainment live updates
Author
First Published Sep 4, 2022, 6:30 PM IST

ఎంటర్‌ టైన్‌మెంట్‌ అడ్డా బిగ్‌ బాస్‌ సీజన్‌ 6(Bigg Boss Telugu 6) అంటూ నాగార్జున(Nagarjuna)హోస్ట్ గా `బిగ్‌ బాస్‌ తెలుగు 6` ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది. ఇందులో ఆటుపోట్లు ఉంటాయి. స్నేహం ఉంటుంది, దాన్ని వెనకాలు ఫైటింగ్‌లుంటాయని, ఎంత వినోదం ఉన్నా అంతిమంగా సక్సెస్‌ కోసం పోరాటమే ఇక్కడ అంతిమ గోల్‌ అని తెలిపింది బిగ్‌బాస్‌. రాజ్యానికి రాజు ఒక్కడే అని, బిగ్‌ బాస్‌లో టైటిల్‌ విన్నర్‌ గెలవడమే అందరి లక్ష్యమని తెలిపారు. 

దాదాపు వంద రోజులపాటు సాగే ఈ వినోదాత్మక రియాలిటీ షో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. నాగ్‌ సింపుల్‌ ఎంట్రీతో ఈ షోని ప్రారంభించారు. మొదట బిగ్‌ బాస్‌ 6 హౌజ్‌ని చూపించారు. ఈ సారి వెరైటీగా మ్యూజిక్‌ తో చూపించారు. మొదట సిట్టింగ్‌ ఏరియాని, తర్వాత స్విమ్మింగ్‌ పూల్‌, బాత్‌ రూమ్‌, గార్డెన్‌ ఏరియా, కిచెన్‌, లివింగ్‌ రూమ్‌, బాల్కానీ, స్టోర్‌ రూమ్‌, కన్ఫెషన్‌ రూమ్‌లు దగ్గరుంచి చూపించారు. 

అనంతరం ఆలస్యం చేయకుండా కంటెస్టెంట్లని పరిచయం చేశారు హోస్ట్ నాగ్‌. మొదట నటి కీర్తి భట్‌ని పరిచయం చేశారు. అద్భుతమైన డాన్సు తో ఆమె బిగ్‌ బాస్‌ 6 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్బంగా తన బ్యాక్‌ గ్రౌండ్‌ చెప్పి కన్నీళ్లు పెట్టించింది. తాను ఒంటరి అని, యాక్సిడెంట్‌ తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయినట్టు చెప్పింది కీర్తి. దీంతో ఓ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నట్టు చెప్పింది కీర్తి భట్‌. 

ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ చైల్డ్ ఆర్టిస్ట్ `పింకీ`గా పాపులర్‌ అయిన సుదీపని పరిచయం చేశారు నాగార్జున. ప్రత్యేక ఏవీ ద్వారా ఆమెని పరిచయం చేశారు. `నువ్వు నాకు నచ్చావ్‌` చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దాదాపు పెద్ద హీరోలందరితోనూ ఆమె కలిసి నటించింది. తన తల్లిదండ్రులు డాన్సు టీచర్లని, తను క్లాసికల్‌ డాన్సు నేర్చుకున్నానని చెప్పింది. తనది లవ్‌ మ్యారేజ్‌ అనే విషయాన్ని ఏవీలో తెలిపింది సుదీప. 

బిగ్ బాస్ కంటెస్టెంట్ లో మూడో కంటెస్టెంట్ శ్రీహాన్ (Srihaan). గత సీజన్ కంటెస్టెంట్ సిరి భర్తనే ఈయన. సోషల్ మీడియాలో కాస్తా పాపులారిటీ  తెచ్చుకున్న శ్రీహాన్ బిగ్ బాస్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ తో మాట్లాడుతూ.. హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సిరి చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పుడు బయటికి వెళ్లినా త్వరగా రమ్మని చెప్పేది అంటూ.. ఈ సారి మాత్రం త్వరగా బయటికి రావొద్దంటూ చెప్పినట్టు చెప్పారు. చివరిగా గతంలో హౌజ్ లో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అన్నింటిని సరి చేయాలని ఉందన్నారు. అనంతరం సిరి కోసం అద్భుతమైన పాట పాడి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

ఫోర్త్ కంటెస్టెంట్ నేహా చౌదరి (Neha Chowdary). అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. జిమ్నాస్టిక్స్ లో జాతీయ స్థాయిలో చాంపియన్ సాధించింది. ఐపీఎల్ యాంకర్ గా  నేహా చౌదరి మంచి పాపులారిటీని దక్కించుకుంది. నాగార్జునతో మాట్లాడుతూ.. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తన పెట్టిన కండీషన్స్ ను తెలిపింది. తనకు మన్మథుడు లాండి లైఫ్ పార్ట్నర్ కావాలని చెప్పింది. హౌజ్ లో ఉంటూ ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పి హౌజ్ లోకీ ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ తెలుగు 6 (Bigg Boss Telugu 6) గ్రౌండ్ లాంచ్ సందర్భంగా సెలబ్రెటీ కపుల్ గా బాలీవుడ్ స్టార్స్ రన్బీర్ కపూర్ మరియు అలియా భట్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రణబీర్ మాట్లాడుతూ ప్రతి సినిమాను ఆరాధించే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా బాగుంది. అందుకోసమే తెలుగు టీచర్ వద్ద ప్రత్యేకంగా తెలుగు భాష నేర్చుకున్నట్టు తెలిపారు. అనంతరం అలియా భట్ తెలుగులో ‘బ్రహ్మస్త్ర’ నుంచి ‘కుంకుమలా’ సాంగ్ ను చక్కగా పాడి అలరించింది. ఈ చిత్రం తర్వాత అలియా తెలుగు వారి ఇంట్లో పార్వతీగా గుర్తుండి పోతుందన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మస్త్ర ప్రీ రిలీజ్ ప్రొమోను ప్లే చేశారు. 

హౌజ్ లోకి ఐదో కంటెస్టెంట్ గా జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటీ ఎంట్రీ ఇచ్చారు. తొమ్మిదేండ్లలో తల్లిని కోల్పోయి చాలా కష్టాలు పడ్డట్టు చెప్పారు. తన కేరీర్ లో ముందుకు వెళ్తునప్పుడు తన ప్రవర్తకు చాలా మంది కోపిష్టి అంటుంటారు. కానీ వారిని నివారించడం నా కర్తవ్యం కాదు. ఇక బిగ్ బాస్ లో తనదైన శైలిలో ఎంటర్ టైన్ చేస్తానని చెప్పారు. ఏవీలో ‘బింబిసార’ గెటప్ లో అదిరిపోయే డైలాగ్స్ చెప్తూ.. ‘చంటిసారా’గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనది లవ్ మేరేజ్ అంటూ.. తన పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మారిందంటూ తెలిపారు.   

ఆరో కంటెస్టెంట్ గా మోడల్ శ్రీసత్య ఎంట్రీ ఇచ్చారు. మోడలింగ్, యాంకరింగ్ పైన మక్కువతో ఎంబీబీఎస్ ను కూడా వదులుకుంది. మిస్ విజయవాడ, మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ గా ఎంపికైంది. ఆ తర్వాత టెలివిజన్ లోకి అడుగుపెట్టింది. తనకు జంక్ ఫుడ్, మొబైల్స్ చాలా ఇష్టమంటూ తెలిపింది. అలాగే చికెన్ కూడా రోజంతా తింటానని చెప్పింది. ఏంచక్కా తనకు నచ్చిన చికెన్ ను బిగ్ బాస్ ముందే తినేసి.. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ తనకో టాస్క్ ఇచ్చారు. చికెన్ నుంచి ముందు కంటెస్ట్ లలో ఎవరికన్న ఒకరికి మాత్రమే ఒక పీస్ ఇవ్వాలని చెప్పి, ఎందుకు ఇచ్చారో కూడా చెప్పాలని ఆదేశించాడు.  

ఏడో కంటెస్టెంట్ గా, నాగార్జున ఫ్యాన్ బాయ్, నటుడు అర్జున్ కళ్యాణ్ (Arjun Kalyan) అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. వైజాగ్ లో బీటెక్ పూర్తి చేసి, న్యూయార్క్ లో ఎంఎస్ చేశారు. అక్కడే న్యూయార్క్ ఫిల్మ్ ఇన్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నారు. కొన్నాళ్లుగా షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్, ఫిల్మ్స్ చేస్తూ వస్తున్నారు. అక్కినేని నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’లోనూ అనుపమా బాయ్ ఫ్రెండ్ గా నటించారని తెలిపారు. బిగ్ బాస్ ద్వారా ఆడియెన్స్ కు దగ్గరకావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత బిగ్ బాస్ నిర్వహించిన ట్రూత్ ఆర్ డేర్ లో పాల్గొన్నారు. తను ఎప్పుడూ కూల్ గా ఉంటానన్నారు. తను బ్రేకప్ తర్వాత కొన్నాళ్లు డిస్టబ్ అయ్యానని, తనకు వచ్చిన ఆఫర్లతో దాని నుంచి బయటపడ్డొట్టు చెప్పుకొచ్చారు. అనంతరం హౌజ్ లోకి వెళ్లారు. 

హౌజ్ లోకి ఎనిమిదో కంటెస్టెంట్ గా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గీతు రాయల్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ముందు నిల్చున్నందుకు చాలా సంతోషంగా ఫీలయ్యింది. 2014లో రన్నింగ్ బస్సు నుంచి కిందపడి, హెడ్ కు 14 కుట్లు పడ్డాయని తెలిపింది. ఆ తర్వాత ఎంటర్ టైన్ మెంట్ లోకి అడుగుపెట్టి.. ఆర్జేగా, యాంకర్ గా, రివ్యూస్ చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి బిగ్ బాగ్ కు ఎంపికైంది. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వికాస్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అనంతరం చైల్డ్ వాయిస్ తో నాగార్జునను ఫిదా చేసింది. బిగ్ బాస్ లోకి రావడానికి మూడు కారణాలు అని చెప్పింది. ఇన్ సెక్యూర్ ఫీలింగ్ పోవడానికి, తన స్ట్రెంథ్ తెలుసుకోవడానికి, ఈషోలో టాప్ 5లో ఉండే మాత్రం థర్డ్ రీజన్ చెప్తానని సస్పెన్స్ లో పెట్టింది. కార్డుతో హౌజ్ లోకి వెళ్లింది.

తొమ్మిదో కంటెస్టెంట్ గా నటి అభినయ శ్రీ (Abhinaya Sri) షాకిచ్చే పెర్ఫామెన్స్ తో ఎంటర్ అయ్యింది.  అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ చిత్రం ‘ఆ అంటే అమలాపురం’ సాంగ్ లో అభినయ శ్రీ నటించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల హ్యాపీగా ఫీలైంది. ఆ ఐటెం సాంగ్ తో మంచి క్రేజ్ వచ్చిన తర్వాత కనిపించకపోవడం బాధాగా ఉందన్నారు. టైం బాగోలేక ఆడియెన్స్ కు దూరమైనట్టు తెలిపింది. ఇప్పటి వరకు 100కు పైగా సాంగ్స్ లో నటించిందని, బిగ్ బాస్ హౌజ్ ద్వారా మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చిందంది.  తను వైల్డ్ ఫొటోగ్రాఫర్ అని, యానిమల్ లవర్ అని బయటపెట్టింది. తను పెట్స్ తో ఉన్న కొన్ని ఫొటోలను షోలో చూపించారు. అయితే తను బల్లి అంటే చాలా భయం అని చెప్పడం విశేషం. హౌజ్ లోకి రావడానికి కారణం.. జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. 

పది, పదకొండో కంటెస్టెంట్స్ గా రోహిత్ సాహ్ని మరీనా ఎంట్రీ ఇచ్చారు. రొమాంటిక్ సాంగ్ తో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. నార్త్ లోని పంజాబ్, గోవాకు చెందిన వీరిద్దరు ప్రస్తుతం హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. ఈ సందర్భంగా వారి లవ్ మ్యారేజ్ చేశారు. ఒక చిత్రంలో కలిసిన వీరి పరిచయం ప్రేమగా మారిందన్నారు.  రోహిత్ హీరోగా ఎంపికైన సినిమాలో తనను హీరోయిన్ గా ఎంపిక చేశారని, కానీ రోహిత్ ను తీసేని మరో హీరోను ఎంపిక చేశారన్నారు. బిగ్ బాస్ ద్వారా తమ లవ్ స్టోరీ రివీల్ అవుతుందన్నారు. హౌజ్ లోకి వెళ్లడం ద్వారా రోహిత్ ఇంట్రోవర్ నుంచి ఎక్ట్రావర్ట్ గా మారాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. రోహిత్ పై గెలించేందుకు ప్రయత్నిస్తామని మరీనా చెప్పింది. ఆ తర్వాత వ్యక్తిగత విషయాలను పంచుకుని హౌజ్ లోకి వెళ్లారు. 

యాక్టర్, రైటర్, యాంకర్ బాలా ఆదిత్య 12వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. యాక్టర్ గా తొలుత ప్రేక్షలకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రైటర్ గా కొనసాగారు.  తర్వాత ఓ కంపెనీ స్టార్ చేసి యాకర్ గా మంచి గుర్తింపు పొందారు. హైజ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ‘విక్రమ్’ బీజీఎంతో అదిరిపోయే ఏవీని ప్రదర్శించారు. నాగార్జున చిత్రాల్లోనూ నటించినట్టు తెలిపారు. అలాగే అక్కినేని నాగేశ్వర్ సినిమాలోనూ పని చేశారన్నారు. ఆయన కేరీర్ లో నంది అవార్డు కూడా అందుకున్నారన్నారు. చార్టెడ్ అకౌంటెంట్ లోనూ ప్రావీణ్యం ఉన్నట్టు తెలిపారు. తనకు రీసెంట్ గా రెండో కూతురు పుట్టడంతో ఆమె ఫొటోను ఫ్రేమింగ్ తో బహూకరించారు. బిగ్ బాస్ కు థ్యాంక్యూ చెబుతూ హౌజ్ లోకి వెళ్లారు. 

ఇక 13వ కంటెస్టెంట్ గా వసంతి క్రిష్ణన్ ఎంపికయ్యారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ యాక్ట్రెస్ గా మరియు మోడల్ గా వసంతి గుర్తింపు తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో పుట్టి పెరిగిందీమె. హీరోయిన్ గా తెలుగు చిత్రం ‘సిరి సిరి మువ్వలు’ చిత్రంలో అలరించింది. అలాగే గోరింటాకు, గుప్పెడంత మనసు డైలీ సిరియల్స్ లో నూ నటించింది. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేందు బిగ్ బాస్ తో సరదాగా మాట్లాడింది. తను ఎక్కువగా అల్లరి చేస్తుందని, కోపం వస్తే బాగా తిడుతానని చెప్పింది. ఆ తర్వాత బాస్ ఇచ్చిన టాస్క్ ను స్వీకరించి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

 

నాపేరు షానీ నాది వండర్ ఫుల్ కహానీ అంటూ 14వ కంటెస్టెంట్ గా ఎంటరయ్యారు. తన అసలు పేరు సొలమాన్ గా చెప్పారు. జడ్చర్లకు చెందిన ఈయన ప్రొఫెషనల్ ఖోఖో ప్లేయర్. నేషనల్ లెవల్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్. 2003లో తన కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అనారోగ్యం కారణంగా తన ప్రొఫెషన్ కు వీడ్కోలు పలికారు. అదే సమయంలో రాజమౌళి ‘సై’ సినిమాలో స్పోర్ట్స్ మెన్ గా ఎంపికయ్యారు. కానీ తనకు కాల్ వచ్చిన రోజే తన మదర్ కూడా చనిపోయిందని ఎమోషనల్ అయ్యాడు. లైఫ్ అంటే హ్యాపీ వర్సెస్ సారో అని, తన ఫెవరేట్ షో ‘బిగ్ బాస్’కు ఎంపిక కావడం హ్యాపీగా ఉందన్నారు. బిగ్ బాస్ తో మాట్లాడుతూ తన ఐదుగురి లవర్స్ పేర్ల నుంచి మొదటి అక్షరాన్ని తీసుకొని (శ్రీలత, హర్షిత, అనితా, నిషా, ఇషా) షానీగా పెట్టుకున్నట్టు తెలిపారు. అదే పేరును ‘సై’ చిత్రంలోనూ పెట్టారని చెప్పారు. 

మోడల్, యాక్ట్రెస్ ఇనాయా సుల్తానా (Inaya Sultana) 15వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్ కు చెందిన ఇనాయా అదిరిపోయే సాంగ్ తో హాట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. బిగ్ బాస్ తో  మాట్లాడుతూ తన తండ్రి కోసమే ఎంటర్ టైన్ మెంట్ లో అడుగుపెట్టినట్టు తెలిపారు. తన తండ్రి రెహమాన్ పేరు నిలబెడతానని తెలిపింది. ఈ షో తర్వాత ఇనాయా రెహమాన్ గా గుర్తింపు పొందుతానని ఆశించింది. ఆ తర్వాత నాగార్జున నుంచి ఓ స్వీట్ హగ్ తీసుకొని హౌజ్ లోకి వెళ్లింది.

మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జేగా టెలివిజన్ ఆడియెన్స్ కు దగ్గరైన సూర్య (RJ Surya) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 6లోకి 16 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా స్టార్ హీరోల వాయిస్ తో క్రియేట్ చేసిన మాషుప్ సాంగ్ తో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఓ టీవీ ఛానెల్ లోనూ ఆర్జే సూర్య ‘కొండ బాబు’గానూ వార్తలు వినిపించారు. ఈ సందర్భంగా  నాగార్జునతో మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచే మిమిక్రీ తెలుసని, ఆ విషయం మా ఇంట్లో తెలియక హాస్పత్రిలో చూపించారని తెలిపారు. కానీ డాక్టర్ వారికి అసలు విషయం చెప్పాడన్నారు. ఆ తర్వాత మహేశ్ బాబు, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ వాయిస్ లను దింపేశాడు. ఆ తర్వాత హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 

తెలంగాణలోని దోమకుంట అనే మారుమూల గ్రామం నుంచి కమెడియన్ గా ఎదిగింది. తన తండ్రి వాచ్ మెన్, తల్లి ఇంట్లో ఉంటుండగా.. ఫైమా ఒక్కతే కూతురు. ‘పటాస్’,‘జబర్దస్త్’ కామెడీ షోల ద్వారా టెలివిజన్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఎట్టకేళలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు 17వ కంటెస్టెంట్ గా ఎంపికైంది. ఇందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు. తనకు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అవకముందు తనను కలర్ పేరుతో చాలా కామెంట్లు చేశారంది. కానీ హౌజ్ లోకి రావడం బాగా ధైర్యానిచ్చిందన్నారు.  షో  తర్వాత తన సొంతింటి కల నెరవేరాలని కోరింది. అనంతరం తన బాయ్ ఫ్రెండ్ రాసిన ప్రేమ లేఖను అందించారు. ప్రవీణ్ రాసిన లెటర్ చాలా ఫన్నీగా ఉండటం విశేషం. ఆ లెటర్ ద్వారా ఫైమాకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత నాగార్జునకు ఓ పొడుపు కథ వేసి అలరించి, హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

తర్వాత హౌజ్ లోకి యూటూర్, బీబీ రివ్యూయర్ ఆదిరెడ్డి 18వ కంటెస్టెంట్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తనను బిగ్ బాస్ షోలో ప్రేక్షకులు రివ్యూయర్‌గా కాకుండా పోటీదారుగా చూస్తే BB6 ప్రయాణం బాగుంటుందని కోరారు. హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు.

ఈసారి కూడా మోడలింగ్‌ రంగం నుంచి బిగ్‌బాస్‌ హౌజ్ లోకి 19వ కంటెంటెస్ట్ గా మోడల్ రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారు.  గతంలో అలీ రెజా, అనిల్‌ రాథోడ్‌, జెస్సీలు పార్టిసిపెంట్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాజశేఖర్.. కల్యాణ వైభోగం, మనసు మమత డైలీ సీరియల్స్‌లో నటించారు. అలాగే ‘మేజర్‌’ సినిమాలోనూ కనిపించాడు. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా బిగ్ బాస్ తో తన జీవిత విషయాలను పంచుకున్నారు. ఆ తర్వాత నేరుగా హౌజ్ లోకి వెళ్లారు.

యాంకర్ గా కేరీర్ మొదలెట్టిన అరోహి రావు ( అంజలి) బిగ్ బాస్ హౌజ్ లోకి 20వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. వరంగల్ కు చెందిన అరోహి సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని బిగ్ బాస్ ముందు చెప్పింది. అనారోగ్యం తల్లి మరణించింది.. తండ్రి రెండో పెళ్లి చేసుకొని వెళ్లిపోయాడు. దీంతో వాళ్ల అమ్మమ్మ దగ్గరే పెరిగిన అరోహి.. యాంకర్ గా కేరీర్ మొదలు పెట్టింది. షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇస్మార్ట్ న్యూస్ తో పాపులర్ అయ్యింది. 

చివరి కంటెస్టెంట్ (21) గా బిగ్ బాస్ బాస్ ‌-6లోకి సింగర్ రేవంత్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ తో చాలా ఫన్నీగా మాట్లాడారు. నాగ్ కూడా రేవంత్ ను మంచి ప్లే బాయ్ అంటూ కామెంట్ చేశారు. ముఖ్యంగా  రేవంత్ భార్య ఆరు నెలల గర్భంతో ఉంది. ఈ సమయంలో ఆమెను వదిలి హౌజ్ లోకి వెళ్లాడు. ఈ సందర్భంగా రేవంత్ తన భార్య పక్కన లేకపోవతున్నందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టేజీ పైకి రేవంత్ భార్య కూడా రావడంతో తన గుండెలకు హత్తుకొని, హౌజ్ లోకి వెళ్లాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios