Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: దీప్తి గుర్తుల్లో షణ్ముఖ్‌.. సిరి కన్నీళ్లు.. రవి నారదుడు.. బిగ్‌బాస్‌కి సన్నీ మొర

గురువారం ఎపిసోడ్‌లో సంచాలక్‌ రవిని బిగ్‌బాస్‌ సీక్రెట్‌ రూమ్‌లోకి పిలిపించి ఓ పవర్ ఇచ్చాడు. దాన్ని ఎవరికిస్తావో అని చెప్పగా, సన్నీ పేరు చెప్పాడు రవి. బయటకు వచ్చి ఆ పవర్ ని సన్నీకి ఇవ్వగా, ఆయన తీసుకోనని చెప్పాడు.

biggboss telugu 5 75th episode intresting conflicts between siri shanmukh sunny manas and pinky
Author
Hyderabad, First Published Nov 19, 2021, 12:22 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5) 75వ ఎపిసోడ్‌ అనేక మజిలీలతో సాగింది. హౌజ్‌లో ఉన్న తొమ్మిది మంది మూడు గ్రూపులుగా విడిపోయారు. సన్నీ(Sunny), మానస్‌, ప్రియాంక, కాజల్‌ ఓ గ్రూపుగా, షణ్ముఖ్‌(Shanmukh), సిరి(Siri) మరో గ్రూపుగా, శ్రీరామ్‌, రవి, అనీ మాస్టర్ ఇంకో గ్రూపుగా ఉన్నారు. సిరి, షణ్ముఖ్ తమ ప్రేమ విషయాల్లో అలకలతోనే సాగుతున్నారు. మానస్‌ కోసం ప్రియాంక తపిస్తూనే ఉంది. ఇక గురువారం ఎపిసోడ్‌లో సంచాలక్‌ రవిని బిగ్‌బాస్‌ సీక్రెట్‌ రూమ్‌లోకి పిలిపించి ఓ పవర్ ఇచ్చాడు. దాన్ని ఎవరికిస్తావో అని చెప్పగా, సన్నీ పేరు చెప్పాడు రవి(Ravi). బయటకు వచ్చి ఆ పవర్ ని సన్నీకి ఇవ్వగా, ఆయన తీసుకోనని చెప్పాడు, తనకిష్టం లేదని, తాను గేమ్‌ ఆడనని మొండికేశాడు. 

ఇంటి సభ్యులంతా పట్టు పట్టారు. కచ్చితంగా Bigg Boss ఇచ్చిన పవర్‌ తీసుకోవాల్సిందే అని చెప్పారు. కానీ Sunny వినలేదు. చివరికి బిగ్‌బాసే స్వయంగా ఆదేశించడంతో అందులో ఉన్న విషయం చదవగా, మైనింగ్‌ వెతికే వారిలో ఒకరి స్థానంలో గోల్డ్ మైనింగ్‌ వెతికే అవకాశం వస్తుంది. శ్రీరామ్‌ నుంచి పవర్‌ని తీసుకున్న సన్నీ గోల్డ్ మైనింగ్‌లో గోల్డ్ గుండ్లు వెతికాదు. ఇందులో అత్యధికంగా ఉన్న మానస్‌, ఆనీ మాస్టర్ల మధ్య కెప్టెన్సీ మూడో కంటెస్టెంట్‌ కోసం పోటీ జరిగింది. అందులో భాగంగా రిబ్బన్స్ ముడేసి ఒక చివరి నుంచి మరో చివరికి త్వరగా రిబ్బన్స్ కడితే విజేత అవుతారు. ఇందులో అనీ మాస్టర్ విన్నర్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కెప్టెన్సీ పోటీదారులుగా ప్రియాంక, సిరి, అనీ మాస్టర్‌ నిలిచారు. 

మరోవైపు నాల్గో పోటీ దారుకోసం మరో అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌. గోల్డ్ గుండ్లు అత్యధికంగా కలిగి ఉన్న ముగ్గురితో పోటీ పెట్టారు. వీళ్లు రేపు ఎపిసోడ్‌లో పోటీ పడతారు. అనంతరం కెప్టెన్సీ టాస్క్ పోటీ జరుగుతుంది. ఇది ఓ వైపు అయితే  సిరి-షణ్ముఖ్‌ ల మధ్య, మానస్‌- ప్రియాంకల మధ్య, సన్నీ-కాజల్‌ల మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. గార్డెన్‌లో వెళ్తున్న సన్నీ వెనకాల కాజల్‌ వస్తుండటంతో.. నువ్వుందుకు తోక లాగా అంటూ కామెంట్‌ చేశాడు సన్నీ. దీంతో కాజల్‌ హర్ట్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమెని ఓదార్చేందుకు నానా తంటాలు పడ్డారు సన్నీ. 

మరోవైపు మానస్‌పై బోల్డ్ కామెంట్‌ చేసింది ప్రియాంక. తాను ఏం చేసినా డిస్‌కనెక్ట్ అవుతున్నాడని సన్నీతో చెప్పింది. దీంతో హర్ట్ అయ్యాడు మానస్‌. మరోవైపు ప్రియాంక కూడా బాధపడింది. తాను ఏం చేసినా ఇలానే చేస్తున్నాడు. దూరం పెడుతున్నాడు అంటూ వాపోయింది.తనకు మనసు ఉందని, తనకూ ఫీలింగ్స్ ఉన్నాయని,అర్థం చేసుకోవాలని వాపోతూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. నైట్‌ మానస్, సన్నీల బెడ్ వద్ద దీనిపై డిస్కషన్‌ జరిగింది. అనంతరం మానస్‌ గార్డెన్‌లో పడుకున్నాడు. దీనిపై సన్నీ.. మానస్‌ని అడగ్గా.. ఎవరైనా తన ముఖం మీద అలిగితే నచ్చదని స్పష్టం చేశాడు. 

మరోవైపు కాజల్‌ని తోక అనే విషయాన్ని తీశాడు సన్నీ. నువ్వు కాబట్టి ఇది కామెడీగా అయిపోయింది. వేరే వాళ్లు అయితే అది పెద్ద ఇష్యూ అయ్యేదని సెటైరికల్‌గా అన్నాడు సన్నీ.వీరిద్దరి మధ్య సరదా సన్నివేశం జరుగుతుండగా, రవి వచ్చాడు. దీంతో నారాయణ వచ్చాడంటూ కామెంట్‌ చేశాడు సన్నీ.దీన్ని ఆ తర్వాత రవి.. తన ఫ్రెండ్స్ శ్రీరామ్‌, అనీ మాస్టర్ల ముందు వాపోయాడు. మరోవైపు తనప్రియురాలు దీప్తిని గుర్తు చేసుకున్నాడు షణ్ముఖ్‌. ఆమె రాసిన లెటర్‌ చదువుకున్నాడు. అది చూసి సిరి నవ్వుకుంది. ఆ తర్వాత బెడ్‌పైకి వచ్చి ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తాను కూడా రింగ్‌ చూసుకుంది. `నీ ప్రాబ్లమేంట్రా` అని షణ్ముఖ్‌ అడగ్గా.. తనని అడగొద్దని చెప్పింది సిరి. ఆ తర్వాత వీరిద్దరు కలిసి కలిసిపోయారు. కానీ అంతలోనే సిరి షణ్ముఖ్‌ నుంచి వెళ్లిపోవడం సస్పెన్స్ కి గురి చేసింది.  మరోవైపు రవి తనని ఇలా చేశాడంటూ బిగ్‌బాస్‌కి మొరపెట్టుకున్నాడు సన్నీ. తనని వెర్రీపుష్పాన్ని చేశాడని కామెడీగా చెప్పుకున్నాడు. మొత్తంగా గురువారం ఎపిసోడ్‌ నవరసాల మేళవింపుగా సాగిందని చెప్పొచ్చు. 

also read: Missing review: మిస్సింగ్‌ తెలుగు మూవీ రివ్యూ..

Follow Us:
Download App:
  • android
  • ios