బిగ్‌బాస్‌ చరిత్రలో నటి బిందు మాధవి చరిత్ర సృష్టించింది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌(ఓటీటీ) తెలుగులో విజేతగా నిలిచింది. అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది.

బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో బిందుమాధవి(Bindu Madhavi) చరిత్ర సృష్టించింది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ తెలుగు విన్నర్‌గా (BiggBoss Non Stop Telugu) నిలిచింది. బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో ఓ లేడీ కంటెస్టెంట్‌ విన్నర్‌గా నిలవడం ఇదే ఫస్ట్ టైమ్‌. హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ఆమె బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ట్రోఫీని అందుకుంది. శనివారం సాయంత్రం జరిగిన గ్రాండ్‌ ఫినాలో బిందు మాధవి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ తెలుగు విన్నర్‌గా నిలిచింది. విన్నింగ్‌ కింద ప్రైజ్‌ మనీ కింద రూ.50లక్షలు అందుకున్నారు బిందు మాధవి. 

Scroll to load tweet…

ఈ గ్రాండ్‌ ఫినాలేలో అఖిల్‌ రన్నరప్‌గా నిలవగా, యాంకర్‌ శివ మూడో స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే `బిగ్‌బాస్‌ తెలుగు 4`లోనూ అఖిల్‌ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అటు టీవీ బిగ్‌బాస్‌, ఇటు ఓటీటీలోనూ ఆయన రన్నరప్‌కే పరిమితమయ్యారు. ఎంతో ఓపికగా గేమ్‌ ఆడుతూ, హార్డ్ వర్కింగ్‌తో బిందు మాధవి బిగ్‌బాస్‌ ఓటీటీ తెలుగు విన్నర్‌గా నిలిచారని అభిమానులు ప్రశంసలు కురిపించడం విశేషం. ఇక ఇందులో నాల్గో స్థానంలో నిలిచిన అరియానా రూ.10 లక్షల ఆఫర్‌తో వైదొలిగడం విశేషం. ఐదో స్థానంలో మిత్ర ఎలిమినేట్‌ అయ్యారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boos Nonstop) పేరుతో తెలుగులో ఫస్ట్ టైం ఓటీటీ ఫార్మాట్ ప్రసారమైంది. రెగ్యులర్ షోకి భిన్నంగా 24*7 కంటెస్టెంట్స్ గేమ్ అందుబాటులో ఉంటుంది. వారాంతాల్లో స్పెషల్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక గత మూడు సీజన్స్ కి హోస్ట్ గా ఉన్న నాగార్జున (Nagarjuna) బిగ్ బాస్ నాన్ స్టాప్ హోస్ట్ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో పాటు కొత్త కంటెస్టెంట్స్ మిక్స్ తో షో సిద్ధం చేశారు. పాత కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, కొత్త కంటెస్టెంట్స్ ని చాలెంజర్స్ గా విభజించారు. 

ఈ షోకి ప్రారంభం నుంచి మిక్స్డ్ స్పందన దక్కింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్, యాంకర్ శివ, మిత్ర, అనిల్ రాథోడ్, అఖిల్ సార్థక్ (Akhil Sarthak), బిందు మాధవి, అరియనా ఫైనల్ కి చేరారు. కాగా బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ గా ఉన్న అఖిల్ సార్థక్ పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. హౌస్ ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఆయన గేమ్ కూడా ఆకట్టుకుంటుంది. అఖిల్ కి హీరోయిన్ బిందు మాధవి (Bindhu Madhavi) నుండి గట్టిపోటీ ఎదురవుతుందని ముందు నుంచీ ఊహించారు, తాజాగా ఫైనల్‌లోనూ అదే జరిగింది. కానీ ఊహించని విధంగా బిందు మాధవిని ప్రకటించి హోస్ట్ నాగార్జున అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు.