స్నేహ (sneha wagh) తన రెండు పెళ్లిళ్లు పెటాకులవడం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. మొదటి భర్త(sneha wagh husband) హింసించాడని, రెండో భర్త టార్చర్‌ పెట్టాడని సదరు ఇంటర్వ్యూలో వాపోయింది.

బిగ్‌బాస్‌(biggboss) మరాఠి మూడో సీజన్‌తో పాపులర్‌ అయ్యింది నటి బాలీవుడ్‌ నటి స్నేహ వాగ్(sneha wagh)‌. నటుడు ఆవిష్కర్‌ దర్వేకర్‌(avishkar)తో కలిసి వీరిద్దరు బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం విశేషం. అతను స్నేహ వాగ్‌ మాజీ భర్త కావడం మరో విశేషం. దీంతో వీరిద్దరు బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్నేహ 19 ఏళ్ల వయసులో ఆవిష్కర్‌ను పెళ్లాడింది. కానీ వీరి దాంపత్య జీవితం ఎంతో కాలం కొనసాగలేదు. తన భర్త శారీరకంగా హింసిస్తున్నాడంటూ అతడికి విడాకులిచ్చేసింది. ఆ తర్వాత 2015లో ఇంటీరియర్‌ డిజైనర్‌ అనురాగ్‌ సోలంకిని వివాహం చేసుకుంది, కానీ పెళ్లైన ఎనిమిది నెలలకే అతడికి కూడా డైవోర్స్ ఇచ్చింది.

స్నేహ తన రెండు పెళ్లిళ్లు పెటాకులవడం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. మొదటి భర్త హింసించాడని, రెండో భర్త టార్చర్‌ పెట్టాడని సదరు ఇంటర్వ్యూలో వాపోయింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై నటి కామ్య పంజాబీ ఘాటుగా స్పందించింది. `అసలు నువ్వేం అనుకుంటున్నావు? నీ ఇద్దరు మాజీ భర్తలు బిగ్‌బాస్‌లోకి రావాలని చూస్తున్నావా? చాలా బాగుంది. కానీ ఎందుకు బాధితురాలిని అంటూ విక్టిమ్‌ కార్డ్‌ ప్లే చేస్తున్నావు? నీ ఫస్ట్‌ మ్యారేజ్‌ గురించి నాకు తెలీదు.. కానీ రెండో పెళ్లి గురించి మాత్రం ఇలాంటి కథలు అల్లాలని ప్రయత్నించకు.

నేను వాస్తవాలను బయటకు తీయగలను అన్న సంగతి నీకు బాగా తెలుసు. గుడ్‌ లక్‌, కానీ గేమ్‌ మాత్రం చెండాలంగా ఆడకు` అని ట్వీట్‌ చేసింది. తనకు సపోర్ట్‌ చేసినందుకుగానూ కామ్యకు అనురాగ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే తను టార్చర్‌ పెట్టానని రుజువు చేయమని స్నేహకు సవాలు విసిరాడు. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో దుమారం రేపుతుంది. 

Scroll to load tweet…