బోల్డ్ లేడీ లహరి ఎలిమినేట్.. ప్రియా, రవి వలలో ఇరుక్కుని బలవుతుందా?
బిగ్‌బాస్(biggboss5) ఐదో సీజన్ మూడో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 19 మంది ఇంటిసభ్యుల్లో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్(elimination) అయ్యారు. మూడో వారం కూడా అమ్మాయినే పంపించబోతున్నట్టు తెలుస్తుంది.
బిగ్‌బాస్5 షో ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. రేటింగ్ పక్కన పెడితే ఇంటి సభ్యుల గేమ్ ఆద్యంతం ఉత్కంఠకి గురి చేస్తుంది.అదే సమయంలో ఇంటి సభ్యుల ప్రవర్తన విషయంలో ఇంకా విమర్శలు వస్తున్నాయి. చాలా మంది కంటెస్టెంట్లు పరిణతి లేకుండా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక బిగ్‌బాస్ ఐదో సీజన్ మూడో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 19 మంది ఇంటిసభ్యుల్లో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం కూడా అమ్మాయినే పంపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో మానస్, లహరి, ప్రియా, ప్రియాంక, శ్రీరాచంద్ర ఉన్నారు. వీరిలో శనివారం ఎపిసోడ్‌లో శ్రీరామచంద్ర, ప్రియాంక సేవ్ అయ్యారు.
ప్రస్తుతం మానస్, ప్రియా, లహరి ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సస్పెన్స్ గా, ఉత్కంఠగా మారింది. అయితే ప్రియా, లహరి మధ్య ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రియా, యాంకర్ రవిల ఉచ్చులో పడి లహరి బలయ్యిందని, ఆమెకి బ్యాడ్ నేమ్ వచ్చిందని, అందుకే తక్కువ ఓట్లు పడ్డాయని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు మూడో వారం ఎలిమినేట్ అయ్యేది లహరినే అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ప్రియా ఎలిమినేట్ అవుతుందని మొదట్నుంచి వినిపించినా, తాజా సమాచారం మేరకు లహరి ఇంటి నుంచి వెళ్లబోతుందనే వార్త బలంగా వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే రాత్రి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.