అవినాష్‌.. ప్రస్తుతం జరుగుతున్న `బిగ్‌బాస్‌ 4`కి వెలుగు, సందడి తెచ్చిన కంటెస్టెంట్‌. జబర్దస్త్ తో బాగా పాపులర్‌ అయిన అవినాష్‌.. ఈ సీజన్‌లో రెండో వారం వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్‌లోకి ఎంటరయ్యాడు. అయితే ఆయన ఎంటరైనప్పుడు వచ్చిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంది. జోకర్‌గా ఆయన ఎంట్రీ నవ్విస్తే, ఆ జోకర్‌ వెనకాల కష్టాలు, లవ్‌ ఫెయిల్యూర్‌ ఎపిసోడ్‌ కన్నీళ్లు పెట్టించింది. మరి ఆ లవ్‌ ఫెయిల్యూర్‌ స్టోరీ ఏంటనేది అవినాష్‌ తమ్ముడు అజయ్‌ బట్టబయలు చేశాడు. 

ఓ ఇంటర్య్వూలో అజయ్‌ చెబుతూ, అవినాష్‌ వాళ్లు ముగ్గురు అన్నదమ్ములని, హైస్కూల్‌ చదువుకునే టైమ్‌లో హాస్టల్‌లో ఉండేవారట. అవినాష్‌ టెన్త్ చదివేటప్పుడు అజయ్‌ ఐదో తరగతి. టెన్త్ లో అవినాష్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడట. ఆమె చుట్టూ రోజూ తిరిగేవాడట. స్కూల్‌కి వచ్చినా ఆమెపైనే ఫోకస్‌ పెట్టేవాడని, ఆమెనే ఫాలో అయ్యేవాడని తెలిపాడు. 

ఆ టైమ్‌లో అన్నయ్య అవినాష్‌ని అజయ్‌ షాప్‌లో మైసూర్‌ పాక్‌, సోనీ పాపడ్‌లు కొనుకుంటానని డబ్బులు అడిగేవాడట. కానీ అవినాష్‌ ఇచ్చేవాడు కాదని, ఈ విషయం తెలుసుకుని అవినాష్‌ ప్రేమించిన అమ్మాయి అజయ్‌కి డబ్బులిచ్చేదట. దీంతో ఏ అవసరం వచ్చినా ఆ అమ్మాయి దగ్గరకి వెళ్లేవాడట అజయ్‌. అక్క.. అక్క అని పిలిచే వాడట. అలా పిలవకూడదని అప్పుడు తెలియదని తెలిపాడు. తాను టెన్త్ కి వచ్చాక, అది లవ్‌ అని తెలుసుకున్నానని  చెప్పాడు. 

అన్నయ్య అవినాష్‌ ఆ అమ్మాయిని ప్రేమించాడని అప్పుడు అర్థమైంది. అయితే ఆ అమ్మాయిని అవినాష్‌ బాగా ప్రేమించాడట. సాధ్యమైతే మ్యారేజ్‌ కూడా చేసుకోవాలని అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల వారి ప్రేమ బ్రేకప్‌ అయ్యిందని, దానికి కారణాలేంటనేది తనకూ తెలియదని తెలిపాడు. లవ్‌ ఫెయిల్యూర్‌తో కెరీర్‌పై దృష్టి పెట్టి మిమిక్రీ, స్టేజ్‌ షోలో చేసేవాడని తెలిపారు. దాని వల్లే ఇక్కడి వరకు వచ్చాడని చెప్పాడు. ఈ సీజన్‌లో అన్నయ్య అవినాష్‌ని విజేతగా చూడాలనుకుంటున్నట్టు అజయ్‌ తెలిపాడు.