బిగ్ బాస్: మరి కౌశల్ ని నాని హెచ్చరిస్తాడా..?

bigg boss2: will nani attack kaushal
Highlights

గతంలో తేజస్వి.. కౌశల్ ని 'వాడు.. వీడు..' అంటూ పిలిచినందుకు నాని వీకెండ్ లో పెద్ద క్లాస్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు కౌశల్.. బాబు గోగినేనిని మర్యాద లేకుండా మాట్లాడడాన్ని నాని ప్రశ్నిస్తాడా..? లేక కౌశల్ ఆర్మీతో పెట్టుకోవడం ఎందుకులే అని గమ్మునుండిపోతాడో..?

బిగ్ బాస్ సీజన్ 2 నిన్నటితో 60 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ షో చాలా ఆసక్తికరంగా సాగింది. అంతిమయుద్ధం టాస్క్ కొనసాగడంతో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కొందరు మేల్ కంటెస్టెంట్స్ కి ఎమోషనల్ టాస్క్ ఇచ్చారు. టాస్క్ ల సంగతి పక్కన పెడితే ఈ ఎపిసోడ్ లో కౌశల్.. బాబు గోగినేనిపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. బాబు గోగినేనిని 'వాడు వీడు' అని పిలుస్తూ నూతన్ నాయుడు దగ్గర మాట్లాడాడు.

నూతన్ నాయుడు.. బాబు గోగినేని దగ్గరకే వెళ్లి మాట్లాడొచ్చు కదా అంటే వాడితో మనం మాట్లాడేదేంటి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వకుండా కౌశల్ మాట్లాడిన మాటలను ఇప్పుడు ఆయన యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆయన లేని సమయంలో వాడు వీడు అని మాట్లాడడం బాగాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిగిలిన హౌస్ మేట్స్ అయితే ఆయన లేని సందర్భంలో కూడా బాబు గారు అని గౌరవించి మాట్లాడుతున్నారు.

మరి కౌశల్ కి ఏమైందంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తేజస్వి.. కౌశల్ ని 'వాడు.. వీడు..' అంటూ పిలిచినందుకు నాని వీకెండ్ లో పెద్ద క్లాస్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు కౌశల్.. బాబు గోగినేనిని మర్యాద లేకుండా మాట్లాడడాన్ని నాని ప్రశ్నిస్తాడా..? లేక కౌశల్ ఆర్మీతో పెట్టుకోవడం ఎందుకులే అని గమ్మునుండిపోతాడో..? చూడాలి!

loader